26.2 C
Hyderabad
December 11, 2024 17: 39 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో స్వేచ్ఛ కోసం రోడ్డెక్కబోతున్న మీడియా

ap secratariat

మీడియా స్వేచ్ఛ ను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన go 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూజే) డిమాండ్ చేసింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాపిత నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచినట్లు iju ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూ జే అధ్యక్షుడు  ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందించటంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు కోరారు. జర్నలిస్టులు తో పాటు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని వారు విజ్ఞప్తి చేశారు. పత్రికలు, టీవీ ఛానళ్లు తో పాటు సామాజిక మాధ్యమాల పైన ప్రభుత్వం కక్షసాధింపు గా వ్యవహరిస్తుంది అనేందుకు ఈ go తీసుకు రావటమే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం go ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం జరుగుతోందని హెచ్చరించారు. కలిసివచ్చే రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులను కలుపుకొని ముందుకు పోవటం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా జీవో ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

Related posts

సమాజ రక్షణలో పోలీస్ సేవలు మరువలేనివి

Murali Krishna

డిసెంబర్ 29న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ

Murali Krishna

ప్రతి యూనిట్ పై పర్యవేక్షణ

Murali Krishna

Leave a Comment