19.7 C
Hyderabad
December 2, 2023 05: 25 AM
Slider సినిమా

ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్న “బ్రేక్” ఎట్టకేలకు ఇన్నాళ్లకు

#kaliveerudu

“కలివీరుడు” నిర్మాత “మినిమం గ్యారంటీ మూవీస్” అధినేత ఎమ్.అచ్చిబాబు

“కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధించి… రికార్డు స్థాయి వసూళ్లతో అర్ధ శత దినోత్సవం సైతం జరుపుకుంది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు. రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బిజినెస్ పరంగా కనీ వినీ ఎరుగని క్రేజ్ సొంతం చేసుకున్న  ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. “కాంతారా” కోవలో “కలివీరుడు” తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, లైన్ ప్రొడ్యూసర్ గా, ప్రొడ్యూసర్ గా ఉన్న తనకు “కలివీరుడు” చిత్రంతో బ్రేక్ వచ్చిందని అచ్చిబాబు అంటున్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పోస్టర్స్: విక్రమ్ ఎ.హెచ్ – అనిల్ కొడాలి, ఛాయాగ్రహణం: హలేష్ ఎస్, ఎడిటర్: ఎ.ఆర్.కృష్ణ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రాఘవేంద్ర, నిర్మాత: ఎమ్.అచ్చిబాబు, రచన – దర్శకత్వం: అవి!!

Related posts

నితీష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన పీకే

Satyam NEWS

నేషనల్ బాక్సింగ్ పోటీలకు కాగజ్నగర్ అమ్మాయి లక్ష్మీప్రియ

Satyam NEWS

ఆరోగ్య శిబిరాలకు చికిత్సకు రండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!