శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో గురజాడ అప్పారావు గారి161 వ జయంతి ఉత్సవం ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన జరిగినది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగు భాషోపాధ్యాయులు, పిసిని వసంతరావు మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారు రచయిత మరియు సంఘసంస్కర్తని ఆనాటి కాలంలో సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి కన్యాశుల్కం అనే ప్రసిద్ధమైన నాటకాన్ని రచించి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చారని తెలుగు వ్యవహారిక భాషకు కూడా ఎనలేని కృషి చేశారని వారి రచనలు వ్యవహారిక భాషలోనే ప్రారంభించారని దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గేయాన్ని రచించి సామరస్యతను నెలకొల్పిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
next post