21.7 C
Hyderabad
December 2, 2023 03: 28 AM
Slider సినిమా

అక్టోబర్ 6న సినీబజార్ డిజిటల్ థియేటర్ లో “నీ వెంటే నేను”

#cinebazar

ఇద్దరు సాప్ట్వేర్ ఇంజినీర్లు హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న విభిన్న ప్రేమ కథా చిత్రం “నీ వెంటే నేను”. శ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్ పతాకంపై అన్వర్ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంతో బాలు – స్నేహ హీరోహీరోయిన్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  వీరిద్దరూ స్వతహా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడం విశేషం. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ క్లీన్ లవబుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం “సినీబజార్” (CINEBAZZAR) అనే డిజిటల్ థియేటర్ లో అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్రావు, హీరో బాలు, హీరోయిన్ స్నేహ, సినీ బజార్ అధినేత రత్నపురి వెంకటేష్ భాస్కర్ పాల్గొన్నారు. నిత్యా నాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

సినీబజార్ సి.ఇ.ఓ రత్నపురి వెంకటేష్ భాస్కర్ మాట్లాడుతూ… “నీ వెంటే నేను” చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ ను తీర్చిదిద్ధాం” అన్నారు. “నీ వెంటే నేను” వంటి క్లీన్ ఎంటర్టైనర్ తో పరిచయం అవుతుండటం పట్ల హీరో బాలు, హీరోయిన్ స్నేహ సంతోషం వ్యక్తం చేశారు. వెంకట్రావు, గణేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ – అప్పాజీ, ఎడిటర్ : శంకర్ బోలం, సంగీతం: శశాంక్ భాస్కరుని, నిర్మాత: వెంకట్రావు మోటుపల్లి, ఛాయాగ్రహణం – దర్సకత్వం: అన్వర్, “సినీబజార్” విడుదల!!

Related posts

చిలుమూరు సైకత లింగ క్షేత్రంలో కోటి గాయత్రీ యజ్ఞం

Satyam NEWS

పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!