38.2 C
Hyderabad
April 29, 2024 20: 30 PM
Slider శ్రీకాకుళం

విద్యార్థినిని ప్రోత్సహించిన కళింగాంధ్ర చైతన్య దీపిక

kalingandhra

కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ మరో లక్ష్యాన్ని చేరుకుంది. 2019 జూన్ లో ప్రారంభమైన కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ సేవే పరమావధిగా కుల, మత, వర్గ, రాజకీయాలతో సంబంధం లేకుండా నిస్వార్థపూరిత సేవలందిస్తూ వస్తుంది. తన లక్ష్యాల్లో భాగంగా ప్రతిభగల విద్యార్థుల్లో సృజనాత్మకత శైలిని వెలికితీసి, వారిని ప్రోత్సహించేందుకు “చైతన్య దీపిక” కార్యక్రమాన్ని ఆరంభించింది.

ఇందులో భాగంగా పొందూరు మండలం తాడివలస  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం “కళింగాంధ్ర చైతన్య దీపిక” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గురుగుబెల్లి ఢిల్లీశ్వరి వాక్చాతుర్యాన్ని అభినందిస్తూ కళింగాంధ్ర సభ్యులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కొత్తకోట శ్రీహరి మాస్టర్ 1000 రూపాయలను ప్రోత్సాహకాన్ని అందజేశారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో స్వామి వివేకానంద ఆంగ్లంలో చెప్పిన ప్రసంగాన్ని తెలుగులో అనువదించి, ఇటీవల పాఠశాల ఆవరణలో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీశ్వరి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సృజనాత్మకతతో కూడిన వక్తృత్వం, అందులోనూ విషయ విశ్లేషణ నైపుణ్యాన్ని అధికంగా గుర్తించి కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ఈ ప్రోత్సాహకాన్ని అందజేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ లక్కినేని హేమనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పైడి ప్రసాద్, పైడి వసంత్ ,ధానేటి రాజశేఖర్ , మెట్ట శ్రీధర్ భట్లు, సిహెచ్ అప్పారావు, పైడి నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు హరి ప్రసన్న ,గురుగుబెల్లి అప్పలనాయుడు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు గ‌ర్వించ‌ద‌గ్గ వ్య‌క్తి అల్లూరి

Satyam NEWS

టర్కిష్ సూఫీ సంగీత ప్రదర్శన ఫిబ్రవరి 3న శిల్ప కళా వేదికలో

Bhavani

చిత్రా రామకృష్ణ కేసులో సీబీఐ దేశవ్యాప్తదాడులు

Satyam NEWS

Leave a Comment