35.2 C
Hyderabad
May 11, 2024 18: 34 PM
Slider మహబూబ్ నగర్

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు బాగు చేస్తారు?

#JanasenaParty

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు పని చేయక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని జనసేన పార్టీ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్, కొల్లాపూర్ నియోజక వర్గం జనసేన పార్టీ నాయకుడు బైర పోగు సాంబశివుడు అన్నారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ నియంత పాలన మూలంగా ప్రాజెక్టు దగ్గరికి ఏ పార్టీ వారు వెళ్లిన అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. జనసేన పార్టీ నేడు KLI (మహాత్మాగాంధీ కల్వకుర్తి  ఎత్తిపోతల పథకం లిస్ట్ 1) ప్రాజెక్టు ను సందర్శించేందుకు వెళ్లిందని అయితే అక్కడికి వెళ్ళడానికి అధికారులు అంగీకరించలేదని వారు తెలిపారు.

ఆ తరువాత CI తో మాట్లాడితే కలెక్టర్ అనుమతి కావాలన్నారని వారు తెలిపారు. కలెక్టర్ పర్మిషన్ తో లోనికి వెళ్లామని వారు తెలిపారు. ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వచ్చిన నీరు ని  20 ఫీట్ల వరకు బయటకు పంపించారని వారు తెలిపారు.

ఇక మిగిలిన 14 లేదా 15 ఫీట్లు నీటిని 2 లేదా 3 రోజుల్లో బయటకు పంపిస్తామని అధికారులు చెప్పారని అన్నారు. ఒక మోటార్ ను రిపేర్ చేస్తున్నారని ఇంత నష్టం కలగడానికి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పచ్చునని వారు తెలిపారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అండర్ గ్రౌండ్ టన్నెల్ జరుగుతున్నప్పుడు నిపుణులు హెచ్చరించారని, బ్లాస్టింగ్ చేయడం వలన పక్కనే ఉన్న కే ఎల్ ఐ టన్నల్ కు  ముప్పు ఉంటుందని నిపుణులు  చెప్పినా అధికారులు బేఖాతరు చేశారని వారు తెలిపారు.

దాదాపుగా 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి నష్టం జరిగిందని వారు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు మూడున్నర నుంచి 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందని పరిస్థితి ఉందని వారు తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలోజనసేన పార్టీ కార్యకర్తలు, రాకేష్ రెడ్డి, రాజేష్, కిరీటి, హరి, సర్వర్, సంతోష్, పాషా, సత్యం, రఘు pr రాజేందర్,  లింగము,రాజు, రమేష్, సాయి, సూర్య,  రాజేష్, గౌతమ్, శివ, లక్ష్మీ నారాయణ జనసైనికులు పాల్గొన్నారు.

Related posts

మార్చి 31 నుండి ఎత్తివేత

Sub Editor 2

రష్యాకు అనుకూలంగా వచ్చిన ప్రజాభిప్రాయ ఫలితం

Satyam NEWS

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేసిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment