38.2 C
Hyderabad
May 5, 2024 20: 16 PM
Slider మహబూబ్ నగర్

ఆస్తిపన్ను చెల్లించే వారికి 90 శాతం వడ్డీ మాఫీ

#Kalwakurthy Municipality

ఆస్తిపన్ను చెల్లించేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కల్వకుర్తి పట్టణంలో ఆస్తి పన్ను చెల్లించే వారి కి 90 శాతం వడ్డీ మాఫీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాకీర్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ఆస్తి పన్ను బకాయిల కోసం ఓ టి ఎస్  పథకాన్ని ప్రారంభించింది.

వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద ప్రాపర్టీ టాక్స్ కేవలం 2019-2020 ఆస్తిపన్ను 10 శాతం వడ్డీ కడితే సరిపోతుందని మిగతా 90 శాతం వడ్డీ మాఫీ చేయబడుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ తేదీ 28/07/2020  జీవో నెంబర్  306 ద్వారా ఆస్తిపన్ను 90% పేరుకుపోయిన మొత్తం10% శాతం వడ్డీతో చెల్లించే వెసులుబాటు ఏర్పాటు చేశారని, పట్టణంలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను చెల్లించేందుకు, వారిని ప్రోత్సహించడానికి  ఆస్తిపన్ను వన్ టైమ్ స్కీమ్ క్రింద  రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు  ఆస్తిపన్నుపై 90% పేరుకుపోయిన బకాయి వడ్డీని ప్రభుత్వం మాఫీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

ఆస్తి పన్ను చెల్లింపుదారులు  2019/20 ఆర్థిక  సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల  మొత్తాన్ని క్లియర్ చేస్తే, 10% వడ్డీతో  “వన్ టైమ్ స్కీమ్ క్రింద చెల్లించవలసి ఉంటుందని, ఆస్తిపన్ను వన్ టైమ్   సెటిల్మెంట్ మొదలు 01/08/2020 నుండి  తేదీ 15/09/2020 వరకు ముగుస్తుంది. కాల వ్యవధి 45 రోజులు ఉంటుందన్నారు.

కల్వకుర్తి పట్టణ  గృహ వినియోగదారులు మరియు వాణిజ్య వినియోగదారులు  ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Related posts

అమిత్ షా తో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ

Satyam NEWS

మేం హిందువులకు వ్యతిరేకం కాదు

Satyam NEWS

విజయనగరంలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ ప్టాప్ ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment