26.7 C
Hyderabad
May 3, 2024 09: 51 AM
Slider నిజామాబాద్

ఆరు గంటల ఆందోళన: రేపు కామారెడ్డి బంద్ కు రైతుల పిలుపు

#farmers

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు చేపట్టిన ధర్నా సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు కొనసాగింది. మరో పది నిమిషాల్లో పోలీసులు అరెస్ట్ చేసి అవకాశం ఉండగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య రైతులు కామారెడ్డి బంద్ కు పిలుపునిస్తూ ఆందోళన విరమించారు. కలెక్టర్ బయటకు రాకపోవడంతో కలెక్టర్ దిష్టిబొమ్మకు వినతిపత్రం అందజేయడంతో పాటు దిష్టిబొమ్మను కలెక్టరేట్ గేటు ముందు ఉంచి దిష్టిబొమ్మపై మహిళా రైతులు మట్టిని పోసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేపు కామారెడ్డి నియోజకవర్గ బంద్ కు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపిచ్చింది.

ఎంపీ అరవింద్ ను అడ్డుకున్న పోలీసులు

రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఎంపీ అరవింద్ ఆర్మూర్ నుంచి బయలుదేరి కాసేపట్లో కలెక్టరేట్ వరకు చేరుకునే సమయంలో రామరెడ్డి బైపాస్ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల వద్దకు వచ్చి కలెక్టర్ వినతిపత్రం తీసుకోవడానికి ఏంటి ఇబ్బంది అని ఎల్లారెడ్డి డీఎస్పీని ఎంపీ ప్రశ్నించారు. వినతిపత్రం తీసుకుంటే తాను ఇక్కడికి వచ్చే అవసరం గాని, నన్ను అడ్డుకునే అవసరం గాని ఉండేది కాదుకదా అన్నారు. రైతులు తమ నిరసన తెలిపే హక్కు కూడ లేదా అని ప్రశ్నించారు. ఎంపీని అడ్డుకున్న విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎంపీ వద్దకు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు ఎంపీని వెళ్ళడానికి అనుమతించలేదు

రఘునందన్ వర్సెస్ ఎస్పీ

రైతులు ఆందోళనను విరమింపజేసేందుకు జిల్లా ఎస్పీ స్వయంగా రైతుల వద్దకు చేరుకున్నారు. రైతులు నలుగురు వస్తే కలెక్టర్ తో మాట్లాడిస్తానని తెలిపారు. దాంతో రైతులు నినాదాలు చేశారు. ‘ఫోర్స్ దింపడానికి నిమిషం పట్టదు. కానీ మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు.’ అంటూ ఎస్పీ రైతులకు సున్నితంగా హెచ్చరిక జారీ చేశారు. వెంటనే మైక్ తీసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎస్పీ గారు సుతిమెత్తగా ధమ్కీ ఇస్తున్నారన్నారు. ఇలాంటి ధమ్కీలు చాలా చూశామని, ఏం చేసినా ఇక్కడినుంచి కదిలేది లేదన్నారు. అంతగా కావాలంటే అదే ఫోర్స్ తీసుకువచ్చి కలెక్టర్ వినతిపత్రం తీసుకునెలా చూడాలన్నారు. ధమ్కీ ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వారే కాదని, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి అందరి వాహనాల నంబర్లు తమకు తెలుసని, అయినా తాము అలాంటి పని చేయకుండా ఇప్పటిదాకా రైతులు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటించామని తెలిపారు.

రైతుల భూములు తీసుకోలేదు: జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్

ఇండస్ట్రియల్ జోన్ కోసం రైతుల భూములు తీసుకోలేదని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. రైతుల ఆందోళనపై కలెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ఫైనల్ కాలేదన్నారు. అభ్యంతరాలు ఉంటే రైతులు తెలుపాలని సూచించారు. అభ్యంతరాలు ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతుల పేరిట ధరణి పోర్టల్ లో వారి పేర్లు ఉన్నాయని చెప్పారు. వారి భూములు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.

గుంట భూమి పోయినా ఎన్నికల్లో పోటీ చేయను: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

ఇండస్ట్రియల్ జోన్ కింద రైతులకు చెందిన గుంట భూమి పోయినా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఎమ్మెల్యే సురేందర్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ లో ఎక్కువ భూములు కోల్పోయేది అడ్లూర్ ఎల్లారెడ్డి రైతులేనన్నారు. మాస్టర్ ప్లాన్ విషయాన్ని ఇదివరకే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఇదే విషయాన్ని నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారితో సమావేశమై చెప్పడం జరిగిందన్నారు. రైతులను ప్రతిపక్ష నాయకులు భూములు పోతున్నాయని రెచ్చగొడుతున్నారని, అమాయక రైతులతో ఆడుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

కలెక్టర్ గా ఎలా చేస్తావో చూస్తా: కలెక్టర్ పై రఘునందన్ రావు ఫైర్

జిల్లా కలెక్టర్ జితేశ్ వెజ్ పాటిల్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వు కలెక్టర్ గా ఎలా పని చేస్తావో చూస్తా అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. మానవత్వం లేని కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చేకంటే దిష్టిబొమ్మకు ఇవ్వడం మేలని రైతులు భవించారని తెలిపారు. ‘ప్రెస్మీట్ పెట్టి రాజకీయాలు చేస్తున్నారని కలెక్టర్ చెప్తున్నారు. ఎవర్రా రాజకీయాలు చేసేది. నువ్వు చేస్తున్నావ్ రాజకీయం.

అధికార పార్టీ ఎమ్మెల్యేను లోపల ఉంచి 8 గంటలుగా రైతులు రోడ్డుపై తిండి, నీళ్లు లేకుండా ఉన్నారని, మహిళలు కనీసం టాయిలెట్ కూడా పోకుండా ఉంటే రాజకీయం చేసింది నువ్వు. నువ్వు వచ్చి రాజకీయాలు చేస్తున్నారంటున్నావ్. సంస్కారం లేని నీలాంటి నీచునికి పొలిటికల్ లీడర్ పవరేంటో చూపిస్తా.. నేను అందరి లాంటి నాయకుని కాదు. నీపై టీఓపిటిలో ఫిర్యాదు చేస్తా.. రైతులను ఎలాగైతే రోడ్డుపై కూర్చోబెట్టావో అలాగే నిన్నుకుడా రోడ్డు మీదకు లాగుతాం. నువ్వు కలెక్టర్ గా ఎలా పని చేస్తావో కూడా చూస్తా.

ఇలాంటి కలెక్టర్లను ఎంతోమందిని చూసినం. 750 జిల్లాలో ఒక జిల్లా కలెక్టర్ ఈయన.. ఉల్లిగడ్డంతటోడు. ఈయన రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థల మీద మాట్లాడితే భయపడతామా.. పోయి పోయి నాతోనా ఈయన మాట్లాడేది. చట్టం తెలిసిన నాకే చట్టం నేర్పించాలని అనుకుంటున్నాడు. నేను నేర్పిస్తా.. చట్టం ఎలా ఉంటుందో కలెక్టర్ కు. ఇంత అహంకారమా కలెక్టర్ కు. ఇదే డాంబార్ రోడ్డుపై నిన్ను కూడా కూర్చోబెడతా.. నువ్వు చూపించిన యాక్షన్ కు రియాక్షన్ చూపిస్తా. అధికారంలోకి వచ్చాక నువ్వు జీవితంలో కలెక్టర్ కాకుండా చేస్తా.. ఇదే నేనిచ్చే వార్నింగ్’ అంటూ హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్

Related posts

కరోనా కట్టడికి స్థానిక వ్యాపారులు సహకరించాలి

Satyam NEWS

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

Satyam NEWS

హిట్లర్ లాంటి నియంతలే పోయారు… నెవ్వెంత?

Bhavani

Leave a Comment