29.7 C
Hyderabad
May 6, 2024 04: 58 AM
Slider హైదరాబాద్

పోలీస్ డైరీ: కమ్మచెట్టి అశోక్ లా మనం ఉండగలమా?

#Kamatipura Police

పేదరికం జేబుకే తప్ప మనసుకు కాదు. ఆలోచన అద్భుతంగా ఉంటే ప్రపంచం సలాం కొడుతుంది. క్రమశిక్షణతో జీవితం సాగితే భవిష్యత్తు తలవంచుతుంది. ఇది కమ్మచెట్టి అశోక్ కథ….. కాదు కాదు… క్రమశిక్షణతో జీవితాన్ని గడిపే వారందరి కథ.

వారికి పేదవారు అని పేరు పెట్టిన వారు పేదవారు తప్ప వీరు కాదు. వీరు గుణంలో ఐశ్వర్యవంతులు. రాతియుగం నుంచి మనిషికి జంతువు, జంతు చర్మాల వినియోగంతో అతి దగ్గర సంబంధం ఉంది. అందులోనూ మానవ నడవడిక లో, పురోభివృద్ధిలో,  పాదరక్షలు అత్యంత ప్రాధాన్యమైనవి.

మానవజాతి వలసలు, స్థిరనివాసాలు, నాగరికతలు, రాజ్యాలు, సమాజాలు ఆధునిక టెక్నాలజీ లు ఇలా వివిధ దశలు గా ముందుకు వెళ్తున్న మనిషికి అత్యంత విలువైన ఉపయోగకరమైన వస్తువులు పాదరక్షలు. “ఎద్దు పాదాలను అనుసరించి నడిచే బండి చక్రాల” మాదిరిగా!

కమ్మచెట్టి అశోక్ S/o రాజయ్య, వయసు 60 సంవత్సరాలు వృత్తి:మోచి

సుదీర్ఘమైన మనిషి ప్రయాణాల్లో మనిషి పాదాలను అంటి పెట్టుకొని పాదరక్షలు ఉంటాయి. కమ్మచెట్టి అశోక్ S/o రాజయ్య, వయసు 60 సంవత్సరాలు వృత్తి: (మోచి) పాదరక్షలు కుట్టే పని. లాక్ డౌన్ ప్రకటన కంటే ముందు అతడు హైదరాబాద్ లోని పాతబస్తీ అయిన కామాటిపుర ఏరియాలో గల వజీర్ అలీ మజీద్ ముందు రోడ్డు పక్కన ఉన్న గోడకు ఆసరా చేసుకొని రెండు కట్టెలు నాటి ఫ్లెక్సీ కవర్తో మనిషి కూర్చునే స్థలంలో చిన్న చెప్పుల షాపు ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రతిరోజు తనను వెతుకుతూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు వారి పాడైపోయిన చెప్పులు, బూట్లు బాగుచేసి,  రోజు రూ400 నుంచి రూ 500 వరకు సంపాదించి తను పిల్లలు లేని తన భార్య జీవనాన్నికొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ఆదేశాల ప్రకారం పోలీసు వారి సూచనలు, సలహాల ప్రకారం జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మార్చి 23.2020 నుండి ఏప్రిల్ ,14 . 2020 వరకు లాక్ డౌన్ ప్రకటించగా కమ్మచెట్టి అశోక్ తన ఇంటిలోనే ఉంటున్నాడు.

పనికోసం వెతుకుతున్న పనిముట్లు

తన  వృత్తి పనిముట్లు అయిన “సంధాన్”  “గూటం”,  “ఆరె”, “అంబుర్”, “రంపి”, “స్క్రూ డ్రైవర్”, తగ్గి దారం, నల్ల మొలలు ( తే కార్స్) తంగల్ మొలలు ముట కట్టి పెట్టి లాక్ డౌన్ విరమణ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు తన ఇంటి ముందు నిలబడి చప్పట్లతో, ఇంటి ముందు దీపాలు వెలిగించి కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా దానితో పోరాడుతున్న పోలీసువారికి , పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి సంఘీభావం ప్రకటిస్తున్నాడు.

అంతేకాకుండా తన దగ్గర ఉన్న ధనాన్ని, ధాన్యాన్ని అతి జాగ్రత్తగా ఖర్చు చేస్తూ తను తన భార్య కాలం గడుపుతున్నారు. రోజూ రోజు పెరుగుతున్న పాజిటివ్ కేసుల ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు మరల ఏప్రిల్, 14. 20 20 నుండి  మే 3, 7 . 20 20 వరకు లాక్ డౌన్ ను పొడిగించగా, అతడు అంతే బాధ్యతగా మసులుకున్నాడు.

సమాజమే తన జీవితం

తన జీవితం సమాజం పై ఆధారపడి ఉన్నది. సమాజం బాగుంటేనే తను బాగుంటాడు అని భావించి అవసరమైతే తప్ప మాస్కు ధరించి బయటికి వెళ్లి తనకు కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాడు. భౌతిక దూరం పాటిస్తున్నాడు. దేశంలో గల వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తు ఎక్కువ మొత్తంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 

ప్రభుత్వాలు మరల లాక్ డౌన్ ను మే, 29 వరకు పొడిగించారు. అశోక్ దగ్గర  ఉన్న డబ్బులు ఖర్చు అయిపోయాయి. తినడానికి తిండి లేని పరిస్థితి. ఆకలి తన బాధ్యతను వడిలేసెల చేస్తుంది.

వృత్తి మొదలెట్టినా కడుపు నిండలేదు

అశోక్ తను, తన భార్య ఆకలి  మంటను చంపు కోవడానికి మరల తన వృత్తిని నమ్ముకొని , సంధాన్, గూటం,  అంబూర్, రంపి పనిముట్లు తీసుకొని గతంలో తనకు చెప్పులు కుట్టే స్థలంలో చెప్పులు కుడుతున్నాడు. అయితే జనం రావడం లేదు. పోలీస్ విధులలో భాగంగా ఆ ప్రాంతంలో  పెట్రోలింగ్ చేస్తున్న నేను అతను రోడ్డుపైన ఉండడం  చూసి అతని సమస్యలు తెలుసుకున్నాను.

మా SHO సలహా, సూచన ప్రకారం అశోక్ కు బియ్యం, కూరగాయలు, ఇతర అవసరమైన వస్తువులు అందించాము. అశోక్, తన షాపు దగ్గర గల స్థలంలో పావురాల కి ఉదయం సాయంత్రం ధాన్యాన్ని, చీమకు బిస్కెట్స్ చక్కెర అందిస్తాడు.. తనకు బుద్ధి ఉన్నప్పుడు నుంచి చెప్పులు తయారుచేసే కంపెనీలో పని చేసి,  గత 14 సంవత్సరాల నుంచి ఇలా రోడ్డు ప్రక్కల చెప్పులు కుట్టే పని చేస్తున్నాడు.

తన పూర్వీకులు హైదరాబాద్ నవాబు కు లేత జంతు చర్మంతో తయారుచేసిన పాదరక్షలు సమర్పిస్తే వాటిని తీసుకున్న అప్పటి నవాబు వాటి పనితనం,  సౌందర్యం, మృదుత్వాన్ని మెచ్చుకుంటూ “వీటిని కాళ్లకు ధరించాల?  లేక  తలపై పెట్టుకోవాలా”?  అని సంతోషపడి వాటిని తన గుండెలకు హత్తుకున్నాడట.

పోలీసులకు మోచి లకు అతి దగ్గరి సంబంధం

ధనికుల నుండి పేదవారి వరకు. రూ10/- చెప్పుల నుండి  రూ 1, 00,000/- చెప్పుల వరకు బాగు చేశానని, వచ్చినది ఎవరు అనేది కాకుండా, ఉంగడలు తెగిన చెప్పులు, సైడ్ పట్టీలు విరిగిన చెప్పులు,  కుట్లు ఓడిపోయిన బూట్లు మాత్రమే తన కనబడతాయని అంటాడు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు ఈ చెప్పుల బాగు చేసే డాక్టర్.

పోలీసులకు మోచి లకు అతి దగ్గరి సంబంధం ఉంది. మా పోలీస్ ట్రైనింగ్ లో తెగిపోయిన బెల్టు లకు, క్రాస్ బెల్టు లకు, పాడైపోయిన షూస్ లకు బ్యాగులను బాగు చేస్తూ మా ట్రైనింగ్ పూర్తి అయ్యేలా మమ్మల్ని సన్నద్ధం చేస్తారు. మా పోలీసు వారు చేసిన సహాయ సహకారాలు పొంది  కమ్మచెట్టి అశోక్, ఈ కరోనా వైరస్ నిర్మూలన లో భాగంగా తను ఇంటి లో ఉండటం కోసం సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు.

కేశవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటి పుర పోలీస్ స్టేషన్, హైదరాబాద్

Related posts

చోరీ అయిన సింహాచలం శ్రీ అప్పన్న ఇత్తడి కానుకల స్వాధీనం

Satyam NEWS

సన్నాసులపై పోరాటం చేసేందుకు ఇక ప్రత్యక్ష కార్యాచరణ

Satyam NEWS

వ్యాన్‌లో 28 అస్థిపంజరాలు.. ఆశ్చర్యంలో భద్రతా దళాలు

Sub Editor

Leave a Comment