27.7 C
Hyderabad
May 15, 2024 04: 46 AM
Slider ఖమ్మం

సమష్టి కృషితో ‘కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

#Kanti Velam

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. ఈ నెల 18వ తేదీ నుండి వంద రోజుల పాటు (పని దినాలు)రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమం పై కొత్తగూడెం క్లబ్ నందు కలెక్టర్ అనుదీప్ అధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్లు, అదనపు కలెక్టర్లు, డీ ఎం హెచ్ ఓ లు, ఇతర శాఖల అధికారులతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి కంటి వెలుగు app తో కూడిన ట్యాబ్ లను పంపిణి అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచన నుండి రూపుదిద్దుకున్న అధ్భుత కార్యక్రమం కంటి వెలుగు అని కొనియాడారు. కంటి చూపు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి తెలిసిందే అని, మానవతా దృక్పథంతో కూడిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో నూటికి నూరు శాతం విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని, ప్రజా ప్రతినిధులు, అధికారులందరిని భాగస్వాములు చేయాలన్నారు.

మొదటి విడతలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమం సందర్భంగా గిన్నీస్ రికార్డులో నమోదయ్యే తరహాలో ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో కోటీ 54 లక్షల మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 50 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేయడం అరుదైన చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఇదే స్పూర్తితో ఈ నెల 18 నుండి మలివిడతగా ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్ళాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్లాన్ చేసుకోవాలని, అదనపు బృందాలు సిద్దంగా ఉండాలన్నారు. 1 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు.

బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం అనీ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యంతోనే కార్యక్రమం విజయవంతం కావడం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ గారి ఉద్దేశ్యం కాబట్టి, అందరం కలిసి పని చేసి, కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరారు.

రెండవ విడత కంటి వెలుగు ను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ వివరించారు. ల్లా వ్యాప్తంగా 481 గ్రామాల్లో 48 టీమ్స్ ద్వారా 7.90లక్షల మందికి చికిత్స అందించనున్నమని, అందుకు తగు ఏర్పాట్లు చేశామని, సిబ్బందికి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మేల్యేలు వనమా వెంకటేశ్వర రావు, హరిప్రియ నాయక్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కొత్తగూడెం, ఇల్లందు మున్సిపల్ చైర్మన్లు కాపు సీతామాలక్ష్మీ, దమ్మాలపటి వెంకటేశ్వర్లు, DM &HO శిరీష, DCHS రవి బాబు, DRO అశోక్ చక్రవర్తి, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Related posts

భార్య మృతి-భర్త పరిస్థితి విషమం

Bhavani

మండలి ఎన్నికల్లో కూడా ఓటర్ల కొనుగోలు దురదృష్టకరం

Satyam NEWS

తెలంగాణ ను దోపిడి చేసేందుకు మళ్లీ సిద్ధమౌతున్న దొంగలు

Satyam NEWS

Leave a Comment