28.7 C
Hyderabad
May 6, 2024 09: 30 AM
Slider వరంగల్

ప్రభుత్వం ఏర్పాటు చేసే కంటి వెలుగు సద్వినియోగం చేసుకోండి

#mulugu

కంటి చూపు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సర్పంచ్ మసరగాని అనితరాణి వినయ్ కుమార్ అన్నారు. ములుగు మండలం రాయినిగూడెం పిహెచ్ సి పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం కంటి వెలుగు ప్రోగ్రాం ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో క్యాంపుకు వసతుల ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనితరాణి రిబ్బన్ కట్ చేసి మాట్లాడారు.

కంటి వెలుగు ప్రోగ్రాం ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే కంటి వెలుగు కార్యక్రమాన్నీ ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మసరగాని వినయ్ కుమార్, ముడతనపల్లి మోహన్, శ్రీధర్, చిట్టిబాబు, గుండ మొగిలి, యూనియన్ బ్యాంకు అధికారులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, వైద్యాధికారి నవ్యరాణి, ఆప్తమాలిక్ వినయ్, డీఈవో మమత, హెల్త్ సూపర్వైజర్ ఉష, పంచాయతీ కార్యదర్శి తిరుపతి,  ఏఎన్ఎంలు గంట రమ, సావిత్రి, ఆశాలు మంజుల, పూలమ్మ, మమత, ఆదిలక్ష్మి,  తదితరులు పాల్గొన్నారు.

Related posts

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన ఎస్వీఎన్ స్వప్న లోక్

Satyam NEWS

3వ తేదీ నిరసనలు జయప్రదం చేయాలని కరపత్రం

Satyam NEWS

Leave a Comment