29.7 C
Hyderabad
May 6, 2024 03: 42 AM
Slider వరంగల్

మల్లంపల్లి మండలం ఏర్పాటుపై రాజకీయమా?

#mallampalli

అవసరం లేని గ్రామాలు మండలాలుగా ఏర్పడుతుంటే అన్నీ ఉన్న ములుగు జిల్లా మల్లంపల్లిని మాత్రం మండలంగా ఏర్పాటు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండలం ఇవ్వకపోగా ఈ మేరకు హామీ ఇచ్చి గెలిచిన నాయకులు మాత్రం ఉద్యమాలను అణిచివేసే కుట్ర లతోనే పబ్బం గడుపుతున్నారు. చిత్తశుద్ది లేని స్థానిక నాయకుల రాజకీయ స్వార్థం తోనే మండలం ఏర్పాటు ఆలస్యమవుతుంది  అని మల్లంపల్లి మండల సాధన సమితి ఆవేదన వ్యక్తం చేస్తుంది.

మల్లంపల్లి మండల ఏర్పాటు కోసం మల్లంపల్లి మండల సాధన సమితి చేస్తున్న ఉద్యమ కార్యచరణలో భాగంగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలతో పాటు అనేక కార్యక్రమాలతో రాష్త్ర స్థాయిలో మల్లంపల్లి మండల ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేసే కార్యక్రమాలు చేశారు. సాధ్యమైనంత మేరకు ఉన్నత స్థాయి అధికారులు, మంత్రులు, అధికార పార్టీకి సంబంధించిన క్రియాశీలకమైన ఎమ్మెల్యేల ను కూడా కలిసి మల్లంపల్లి మండల పరిధి ప్రజల ఆకాంక్షను తెలియచేసినట్లు చెప్పారు.

ప్రభుత్వం తలుచుకుంటే ఐదు ఎంపీటీసీలకు పైగా ఎంపీటీసీలతో మండలాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయవచ్చో డాక్యుమెంట్ ద్వారా వినతి పత్రాన్ని  క్రియాశీలక మంత్రులు హరీష్ రావు , కేటీఆర్ ని కలిసి మండల పూర్తి సమాచారాన్ని అందించడం జరిగింది. వారు ఇచ్చిన సానుకూల స్పందన కు గానూ మల్లంపల్లి మండల సాధన సమితి,  ప్రభుత్వాన్ని గౌరవించి తమ ఉద్యమ కార్యచరణలను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. 

కానీ హామీల్లో లేని గ్రామాలను అక్కడి స్థానిక నాయకుల ప్రత్యేక చొరవతో  మండలాలు ఏర్పడుతున్నప్పటికి,  ఏర్పాటు చేసుకుంటున్నప్పటికి , ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ గా నాలుగేండ్లు గడిచిన ఇంకా మిగిలి ఉన్న మల్లంపల్లిని  మండలంగా ఏర్పాటు మాత్రం ఇంకా చేయడం లేదు. ప్రజలు ఆగ్రహం తో పాబ్బం గడుపుకునే రాజకీయ నాయకులను ఇళ్ళల్లోనుండి తరిమికొట్టకముందే మండలం ఏర్పాటు చేయాలని  హెచ్చరిస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్ష కార్యదర్శులు నాయకులు గోల్కొండ రాజు కానుగంటి సతీష్ పోనుగంటి రవి ఎడ్ల అనిల్ రెడ్డి కుక్కల సంపత్ చందా రాము, మొహ్మద్ బాబుల్, బక్కీ నాగరాజు, నాయకుల ప్రభాకర్, చెన్నబోయిన మహేందర్, బక్కి శ్రీను, మురహరి శ్రీను, కోటి, మురహారి శ్యామ్, గాజు అజయ్ వడ్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ములుగు  జిల్లా కేంద్రంలో తైక్వాండో పోటీలు ప్రారంభం

Satyam NEWS

హర్యానాలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్ ఉత్తర్వులపై స్టే

Satyam NEWS

మేకల బాలస్వామి కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి పరామర్శ

Satyam NEWS

Leave a Comment