36.2 C
Hyderabad
May 10, 2024 16: 49 PM
Slider ఆధ్యాత్మికం

అక్టోబర్ 26 నుంచి శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు

#srisailam

శ్రీశైలంలో కార్తీక మాసోత్స‌వాలను నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆల‌య ఈవో ల‌వ‌న్న తెలిపారు. అక్టోబ‌ర్ 26 నుంచి న‌వంబ‌ర్ 23వ తేదీ వ‌ర‌కు కార్తీక మాసోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యించింది. కార్తీక మాసోత్స‌వాల నిర్వ‌హ‌ణ నేప‌థ్యంలో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని అన్ని విభాగాల అధికారుల‌ను ఆదేశించారు.

కార్తీక సోమ‌వారాలు, కార్తీక పౌర్ణ‌మి, శుద్ధ‌, బ‌హుళ ఏకాద‌శులు, కార్తీక‌మాస శివ‌రాత్రి, ప్ర‌భుత్వ సెల‌వు రోజుల్లో భ‌క్తులు అధికంగా త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌, ర‌ద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల‌ని ఈవో ల‌వ‌న్న సూచించారు. ఇక పాతాళ‌గంగ వ‌ద్ద ఉన్న టాయిలెట్లు, స్త్రీలు దుస్తులు మార్చుకునే గ‌దులతో పాటు మెట్ల మార్గంలో అవ‌స‌ర‌మైన మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. న‌వంబ‌ర్ 8వ తేదీన చంద్ర‌గ‌హ‌ణం సంద‌ర్భంగా ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6:30 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ద్వారాలు మూసి ఉంటాయ‌న్నారు. ఆ రోజున అన్ని ఆర్జిత‌, శాశ్వ‌త‌, ప‌రోక్ష సేవ‌లు నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Related posts

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: వసంత నాగేశ్వరరావు

Satyam NEWS

కన్హయ్య దారుణ హత్యకు రాజస్థాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Satyam NEWS

వైసీపీ పాలనలో చార్జీల మోత

Bhavani

Leave a Comment