రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు ను మాజీ మంతరి అయ్యన్న పాత్రుడు నేడు కలిశారు. వసంత కృష్ణ ప్రసాద్ నేడో రేపో టీడీపీ లోకి వస్తున్నాడని నాగేశ్వరరావు తెలిపారు. వసంత కుటుంబం మళ్ళీ టీడీపీ లోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. మైలవరం ఎమ్మెల్యే గా కృష్ణ ప్రసాద్ విసిగిపోయిన చేద్దామన్న అభివృద్ధి చేయలేకపోవడం వైసిపి లో సరైన గౌరవం లేదని వసంత నాగేశ్వరరావు అన్నారు. కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి చేరడం లేదు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం కాపాడేందుకు టీడీపీ లో చేరుతున్నాడని వసంత నాగేశ్వరరావు అన్నారు.
previous post