ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు.తమపై పోలీస్ అధికారులు చేస్తున్న దాడులకు ప్రతీకార దాడులు చేపడుతున్నారు.జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ శిబిరాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో ఈ రోజు దాడి చేశారు. అయితే ఈ దాడి కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో భారత భద్రతా దళాలు చేసిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు, ఒక పొలిసు అధికారి మరణించిన కొన్ని గంటల తరువాత జరిగింది. కాగా ఈ గ్రెనేడ్ దాడిలో ఎవ్వరు గాయపడలేదని సంబంధిత అధికారులు తెలిపారు.ఇది ఇగ్రవాదులు చేసిన ప్రతీకార చర్యగా అధికారులు భావిస్తూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
previous post