40.2 C
Hyderabad
May 1, 2024 19: 01 PM
Slider ఆధ్యాత్మికం

ఈ నెల 7న ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ”

#Tirumala

తిరుమల శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదికపై జూలై 15వ తేదీ నుండి టిటిడి నిర్వ‌హిస్తున్న విరాట‌ప‌ర్వం – లోక క‌ల్యాణ పారాయ‌ణంలో భాగంగా ఈ నెల 7వ తేదీ కీచ‌క సంహార ఘ‌ట్టాన్ని పారాయ‌ణం చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు ” కీచ‌క సంహారం – నారీ నీరాజ‌నం ” పేరిట మ‌హిళ‌ల‌చే వినూత్నంగా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది.

తిరుమ‌లలోని గోకులం అతిథి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి ఈ కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌పై వివిధ విభాగాల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

విరాట‌ప‌ర్వంలో కీల‌క ఘ‌ట్ట‌మైన కీచ‌క సంహారం సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌తో దీపాలు ( ప్ర‌మిద‌లు) వెలిగించి ఈ ఘ‌ట్టంలోని సారాంశాన్ని తెలియ‌జేసే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్ -19 జాగ్ర‌త్త‌లు ప‌క్క‌గా అమ‌లు చేస్తూ త‌గిన భ‌ద్ర‌త ఏర్పాట్లు చేయాల‌న్నారు.

ఎస్వీబీసీ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డానికి ముందుగానే అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. ఎస్వీబీసీ, ఆరోగ్య, విజిలెన్స్‌, వ‌స‌తి, అన్న‌దానం విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌న్నారు. 

కార్తీక మాసం సంద‌ర్భంగా ఎస్వీబీసీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేలా త‌గిన ప్ర‌ణాళిక రూపొందించాల‌న్నారు. కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫ‌లితాలు, ఇందుకు సంబంధించిన ప్ర‌వ‌చ‌నాలు, వ్యాఖ్యానాలు వీక్ష‌కులను ఆకట్టుకునేలా రూపొందించాల‌న్నారు.

ఎస్వీబీసీ సిఇవో సురేష్ కుమార్‌, ఎస్ ఇ- 2 నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోలు బాలాజి, నాగ‌రాజు, ఆరోగ్య విభాగాధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ద‌క్షిణామూర్తి, విజివో మ‌నోహ‌ర్‌, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

Related posts

ప్రపంచ మృత్తిక ఆరోగ్య దినోత్సవ౦

Satyam NEWS

ఇడుపులపాయకు చేరిన ముఖ్యమంత్రి జగన్

Satyam NEWS

పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లల నోట్లో శానిటైజర్

Satyam NEWS

Leave a Comment