31.7 C
Hyderabad
May 2, 2024 10: 50 AM
Slider కవి ప్రపంచం

వసుధ వందనం

#PattemVasantha

సకల చరాచర జీవరాశుల

మనుగడకు నీవే ఆధారం

స్వచ్ఛమైన గాలి‌ నీరు నేల

నీ సొంతమై విలసిల్లుతున్న

ఓ వసుధ నీకు వందనం…

అనాగరిక మానవుడు

నిన్నే నమ్ముకుని జీవించే

ఎగిలివారంగనే నిద్రలేచి

భూ,గోమాతల సేవలో తరించి

ప్రకృతి దేవతలను పూజించే..

ఆధునిక పోకడలతో

భూదేవి ఒళ్లంతాచింద్రాలతో

అడుగంటిన భూగర్భ జలాలు

కాలుష్యపు కోరల్లో పుడమి

నేల కొరుగుతున్న అడవితల్లి

పెరిగిన ప్లాస్టిక్ భూతం

కనుమరుగైన జంతుజాలం

తరిగిపోతున్న శిలాసంపద

ఆక్సిజన్ దొరకక జనం విలవిల

విపత్కర పరిస్థితుల్లో మానవులు

విశ్వమంతా కరోన్మాదం

కరాళ నృత్యం చేస్తూ

శవాలను రాసులుగా పోస్తున్న

నీ బిడ్డలను మన్నించి

ఒడిలో దాచుకునే  ఓ ధరణి

స్వార్థ చింతన స్వాలాభాపేక్షతో

అణువణువు దోచుకుంటూ

విచక్షణ కోల్పోయిన నాగరికులు

తన ఉనికికే ముప్పుతెచ్చుకునే

మానవాళి కళ్ళు తెరిపించు భూమాత

పత్తెం వసంత, కరీంనగర్

Related posts

మీ కుటుంబ పాలనలో ఆడపడుచులు భాగం కాదా?

Satyam NEWS

హైదరాబాద్ లో సౌదీ అరేబియా కాన్సులేట్ కార్యాలయం

Satyam NEWS

13న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Satyam NEWS

Leave a Comment