37.2 C
Hyderabad
April 30, 2024 12: 20 PM
Slider ఖమ్మం

ఇంటి నిర్మాణాలకు ఐదులక్షలు ఇవ్వాలి

five lakhs should be given for the construction of a house

సొంత జాగా కలిగిన పేదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఖమ్మం  తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పంధా కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. తొలుత  జూబ్లీ క్లబ్ నుండి ప్రారంభమైన ర్యాలీ  తహసిల్దార్ కార్యాలయం వరకు  నిర్వహించారు . ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా  ఖమ్మం డివిజన్ కార్యదర్శి ఆవుల అశోక్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి రామయ్య లు మాట్లాడుతూ వేలాది డబల్ బెడ్ రూమ్ లో ఇస్తామని ఆశ కల్పించి, ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని , వివిధ వేదికల్లో సొంత జాగ కలిగినవారికి  ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తానని కెసిఆర్ హామీ ఇచ్చి  ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని ప్రకటించడం అన్యాయమని అన్నారు .

ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో సంక్షేమ పథకాలు విచ్చలవిడిగా ప్రకటిస్తూ ప్రజల్లో ఆశలు కల్పిస్తూ ఆచరణలో వాటిని విస్మరిస్తున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  గడిచిన మూడు సంవత్సరాలుగా ఆసరా పెన్షన్ లు  పెండింగ్ లో  పెట్టి పేదలకు ఇబ్బంది పెడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.  నూతన రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.  దీనితో నూతనంగా వివాహమైన కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు.  అంద చేయాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించకుంటే పేదలు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు ఝాన్సీ రామారావు శ్రీను చందు కొమురయ్య లక్ష్మీనారాయణ మంద సురేష్ స్వరూపరాణి సత్తార్ షాను రమ  తదితరులు పాల్గొన్నారు

Related posts

యాచేంద్ర ఆశీస్సులు తీసుకున్న వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్

Satyam NEWS

ప్రధాని దిష్టి బొమ్మ దగ్ధం చేయడం వెకిలి రాజకీయాలకు నిదర్శనం

Satyam NEWS

బ్లాక్ మెయిలర్ ను మర్డర్ చేసి …..మర్మాంగం కోసి…

Satyam NEWS

Leave a Comment