40.2 C
Hyderabad
May 6, 2024 16: 08 PM
Slider మహబూబ్ నగర్

ఇంటిలాగా మన ప్రాంతాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి

#narayanapet collector

ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ డి హరిచందన అన్నారు.

సోమవారం జిల్లా కేంద్రం లో 3  వ పట్టణ ప్రగతి  లో భాగంగా 5 వార్డ్ లో ఏర్పాటు చేసిన మొక్కల నాటే కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ కూడా పాల్గొని మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలు కావాలని అన్నారు. ఇంటి చెత్తను ఇంటి ముందు కు వచ్చే మున్సిపాలిటీ ట్రాలీ కి  వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా  ఉంచుకోవాలని కోరారు.

మురుగు నీటి వలన డెంగ్యూ మలేరియా ఇతరత్రా రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇంటికి ఇంగుడు గుంతలు, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ప్రజలను కోరారు.

శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసియర్ ఆరోగ్య తెలంగాణగా మార్చాలని గ్రామ, పట్టణ లలో నివసించే ప్రజలు ఆరోగ్యాంగా  ఉండాలనే ఉద్దేశ్యంతో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమ లు నిర్వహిస్తున్నారని తెలిపారు.

పట్టణాల కంటే పల్లెల్లో నివసించే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పల్లెలలో పచ్చదనం ఉంటుందని అందుకే ముఖ్యమంత్రి పట్టణాలలో నివసించే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్రతి  ఇంటి  మొక్కలను అందించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమం లో పట్టణ ప్రత్యేక అధికారి జయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఎలక్ట్రికల్  ఎ ఈ, వార్డు ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Trespassing: కోర్టు ఆర్డర్ ఉన్నా యథేచ్ఛగా ఆక్రమణ

Satyam NEWS

చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగ అరెస్టు

Satyam NEWS

యాక్సిడెంట్ :ఖమ్మంలో ఇద్దరి మృతి 5గురికి గాయాలు

Satyam NEWS

Leave a Comment