40.2 C
Hyderabad
April 28, 2024 16: 10 PM
Slider నల్గొండ

చిట్యాల పట్టణ ప్రగతికి నా వంతు సాయం చేస్తా

#chityala palle pragati

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణ ప్రగతికి తన వంతు సహాయం అన్ని అందిస్తారని అని ఎడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ  వార్డు పట్టణ ప్రగతి కార్యక్రమం కౌన్సిలర్ జడల పూలమ్మ అధ్యక్షతన సోమవారం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో ఇచ్చిన హామీలో భాగంగా వైకుంఠ దామాన్ని ప్రారంభించుకొని తుది దశకు తీసుకొచ్చామని అని అన్నారు.

పట్టణం లో పౌరుల ఆహ్లాదం కొరకు 5 నుండి డి 10 ఇది ఎకరాల స్థలంలో పార్క్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని  మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే విద్యుత్ సమస్య ఉన్నచోట కావలసిన పరికరాలు కోసం అంచనా  వేసి ప్రతిపాదన  లు పంపించాలని ఏ ఈ కి సూచించారు.

పట్టణంలో మురికి కాలువల సమస్య లేకుండా సపర్యలు చేపడుతున్న మునిసిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు.

ఇంటింటికి 6 మొక్కలు నాటి వాటిని రక్షించాలని అని అన్నారు. మన మున్సిపాలిటీని మనమే అభివృద్ధి చేసుకోవాలని ప్రతి విషయంలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు.

జాతీయ రహదారిపై విద్యుత్ దీపాలు పరిశుభ్రత ఈ విషయంలో జి ఎమ్ ఆర్ సంస్థ అలసత్వం వహిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి పలువురు తీసుకుపోయిన సందర్భంగా సమస్యను పరిష్కరిస్తానని  రాహుల్ శర్మ హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, కమిషనర్ ఎం రామ దుర్గా రెడ్డి, కౌన్సిలర్లు రెమిడాల లింగ స్వామి జమాండ్ల జయమ్మ, బెల్లి సత్తయ్య కోనేటి కృష్ణ, మున్సిపల్ ఎస్ ఐ శ్రీ రామదాస్ సురేష్ నాయకులు జడల చిన్న మల్లయ్య రుద్రవరం యాదయ్య సిలివేరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

హైదరాబాద్ శివార్లలో విరగకాస్తున్న రుద్రాక్ష పంట

Satyam NEWS

విభజన సమస్యలపై ఏపి తెలంగాణ చర్చలు

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఈనెల 27న టియుడబ్ల్యూజే జిల్లా మహాసభ

Bhavani

Leave a Comment