42.2 C
Hyderabad
May 3, 2024 17: 19 PM
Slider విజయనగరం

ప్రజా సమస్యల పరిష్కారానికి విజయనగరంలో “టెలి-స్పందన”

#rajakumari IPS

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించేందుకు “టెలి-స్పందన” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి నిర్వహించారు. ఈ “టెలి-స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ  08922-276163 ఫోన్ నెంబ‌ర్ ద్వారా నాలుగు ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. 

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రతీ సోమవారం ఉదయం 10-30 గం||ల నుండి మద్యాహ్నం 1-00 గం|| వరకు “టెలీ స్పందన” నిర్వహిస్తున్నామన్నారు. ఎస్పీ ఆఫీసుకు  ఫిర్యాదు చేయాలనుకొనే వారు ప్రతీ సోమవారం ఉదయం 10-30 గం||ల నుండి మద్యాహ్నం 1-00 గం||ల మధ్య  ఫోను చేసి తమ సమస్యలను తెలియజేయ‌వచ్చునన్నారు.

ఈ  “టెలి-స్పందన” కార్యక్రమంకు వచ్చిన కొన్ని ముఖ్యమైన ఫిర్యాదులు…ఇలా ఉన్నాయి. కురుపాం  కి చెందిన ఓ బాదితురాలు త‌న‌ మండలానికి చెందిన వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నాన‌ని…, కొంత కాలం బాగా చూసుకొని తరువాత నుండి ఆమెను సరిగా చూడకుండా వదిలి పెట్టి వెళ్ళిపోతున్నాడని, తన భర్తపై చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు.

,శ్రీకాకుళం జిల్లా పోలాకి  కి చెందిన ఓ  వ్యక్తి… తాను డెంకాడ మండలం, రఘుమండలో కొంత వ్యయసాయ భూమిని బొడ్డవలస  కి చెందిన ఒక వ్యక్తి వద్ద 10 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి కొనుగోలు చేశాన‌ని…, ఇంత వరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదని,  క‌ట్టిన డబ్బులు చెల్లించలేదని, తనపై చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు.

కొమరాడ మండలం, చెక్కవలస కి చెందిన ఓ  బాధితురాలు … తనతో పాటు ఇంట్లో నివాసం ఉంటున్న తన  చెల్లెలు  ప్రతి రోజూ అసభ్యకరంగా తిడుతూ, ఇంటి నుండి వెళ్ళిపొమ్మంటున్నారని, ఆమెపై చర్య తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరారు.

ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ స్వయంగా ఫోనులో మాట్లాడి, వాటిపై క్షణమే చర్యలు తీసుకోవాలని, వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను వెంటనే తనకు నివేదించాలని అధికారులను జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు.

Related posts

దళితుల భూములను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

Satyam NEWS

ఆకాశ హర్మ్యం బుర్జు ఖలీఫా కట్టిన కంపెనీ దివాలా

Satyam NEWS

సిఎం జగన్ ను కలిసిన సినీనటుడు పృధ్వీరాజ్

Satyam NEWS

Leave a Comment