31.7 C
Hyderabad
May 7, 2024 00: 58 AM
Slider ప్రత్యేకం

అమీర్ పేట హోటల్ ఆదిత్య పార్క్ లో కేరళ ఫుడ్ ఫెస్టివల్

#kerala food festival

హైదరాబాద్ అమీర్ పేటలోని హోటల్ ఆదిత్య పార్క్ లో ఉన్న ద ప్రమోనేడ్ రెస్టారెంట్ వారు “ఓనం సద్య” కేరళ ఫుడ్ ఫెస్టివల్ ను 21 ఆగష్టు నుండి 23 ఆగష్టు వరకూ నిర్వహిస్తున్నారు.  ఇందులో సాంప్రదాయ కేరళకు సంబంధించిన పలు సాంప్రదాయ వంటకాలు మేళవించి రూపొందించిన రుచులను ఈ సందర్భంగా ఆస్వాదించవచ్చు.

హోటల్ కు చెందిన మాస్టర్ ఛెఫ్ శ్రీనివాస్ ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసిన వంటకాలతో కూడిన ఈ మెనూలో కేరళ ప్రాంతానికి చెందిన రుచలను స్వయంగా అనుభవించవచ్చు. ఎంపిక చేసిన మళయాళి రుచుల మేళవింపుతో రూపొందించిన వంటకాలతో 3 రోజుల పాటూ సాగే ప్రయాణం ఇది.  ఈ ప్రయాణంలో ఈ ప్రాంతపు వంటకాలతో పాటూ వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలలో ఎంతో అనుభవం గడించిన ఛెప్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం కొందరికే పరిమితమైన ఈ వంటకాలను మీ అందరికీ పరిచయం చేయబోతోంది.

ఈ 3 రోజుల ప్రయాణంలో ఎన్నో రుచికరమైన వంటకాలు ముఖ్యంగా వాజై అప్పర్, సర్కార వరాట్, పులి ఇంజి, కడు మంగ, నిరంగ అచార్, మధుర కర్రి, వెల్లారి పచ్చడి, పజమ్ నురుక్కు, కేరళ పాపడ్, బనానా, పయారు థోరన్, అవియల్, కాలన్, ఓలన్, కూటు కర్రి, కైథా చక్కా పుసిశ్శెరి, నీ పరుప్పు, సాంబార్, రసమ, సంబరమ్, అడ్ ప్రధమన్, చెరుపాయర్ ప్రధమన్ వంటి వెజిటేరియన్ వంటకాలు మెనూలో భాగంగా ఉంటాయి.  ఇలా తయాలు చేసిన కేరళ భోజనాన్ని సాంప్రదాయ పద్దతిలో అరటిఆకు పై అందించడం జరుగుతుంది.

నేడు ఈ ఫుడ్ ఫెస్టివల్ వివరాలను ప్రత్యేక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడిస్తూ హోటల్ ఆదిత్య పార్క్ కు చెందిన F&B మేనేజర్  రాజా మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రుచులను గెస్టులకు అందించే లక్ష్యంతో ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని చెప్పారు.  ప్రతి వ్యక్తికి కేవలం 499 రూపాయల (ట్యాక్స్ లు అదనం) లకే ఈ భోజనం అందించడం జరుగుతుందని తెలిపారు.  భోజన వేళలలో అందించే రుచులకు అనుగుణంగా కేరళ ను గుర్తుకు తెచ్చేలా రెస్టారెంట్ ను అలంకరించిన తీర్చిదిద్దడంతో ఒక మంచి భావన కలుగుతుందని ఆయన వివరించారు.

ఇలా గాడ్స్ ఓన్ కంట్రీగా ప్రఖ్యాతి గాంచిన కేరళ కు చెందిన ప్రత్యేకమైన రుచులను ఆస్వాదించాలనుకొనే భోజన ప్రియులను రెస్టారెంట్ సాదరంగా ఈ ఫుట్ ఫెస్టివల్ కు ఆహ్వానిస్తోంది.

రిజర్వేషన్లు మరియు ఇతర సమాచారం కోసం సంప్రదించండి: హోటల్ ఆదిత్య పార్క్, ఆదిత్య ట్రేడ్ సెంటర్, అమీర్ పేట, హైదరాబాదు – 7032900753 – 04066788888

Related posts

ఐదు నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే మృత్యు ఒడికి

Satyam NEWS

హుజూర్ నగర్ నియోజకవర్గంలో మిన్నంటిన టిఆర్ఎస్ శ్రేణుల నిరసనలు

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

Satyam NEWS

Leave a Comment