40.2 C
Hyderabad
April 26, 2024 12: 26 PM
Slider పశ్చిమగోదావరి

ఉన్నతాధికారి లైంగిక వేధింపులు: అటకెక్కిన విచారణ?

#sexualharassment

ఉన్నతాధికారి లైంగిక వేధింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? మనం ఏ కాలంలో ఉన్నాం? ఈ ప్రశ్నలు పలువురి మదిని కలచివేస్తున్నాయి. విషయం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లుపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు జిల్లా రిజిస్ట్రార్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

లంకా వెంకటేశ్వర్లు తన కార్యాలయంలో పని చేస్తున్న 11 మంది మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారనేది ఫిర్యాదు సారాంశం. ఈ ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరింకేం… లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారికి శిక్ష పడటం ఖాయమని అందరూ భావించారు. ప్రభుత్వం కూడా ఇంత వేగంగా స్పందించి ఫిర్యాదుపై విచారణ చేయిస్తున్నందుకు సంతోషపడ్డారు.

అయితే రోజులు నెలలు గడుస్తున్నా ఆ విచారణ ఏమైందో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. నిందితుడు, బాధితులు, విచారణాధికారి ఒకే శాఖకు చెందిన వారు కావడం తో విచారణ ను ముందుకెళ్ళకుండా పక్కదారి పట్టించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు. లైంగిక వేధింపులకు గురైన 11 మంది మహిళా ఉద్యోగులను బెదిరించి, ప్రలోభపెట్టి విచారణ తుంగలో తొక్కారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది.

నిందితుడిని రక్షించడానికి రాష్ట్ర స్థాయిలో లాబీయింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి.  లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు వినిపిస్తున్న ఆరోపణలలో నిజమెంత? అనే ప్రశ్న కూడా తలెత్తుతున్నది. ఈ విచారణ ను పక్కదారి పట్టించడానికి ఓ అధికారికి 30 లక్షల విలువ చేసే ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చారని జరుగుతున్న ప్రచారం లో వాస్తవాలు ఖరారు కావడం లేదు.

11మంది మహిళా ఉద్యోగుల లైంగిక వేధింపుల విచారణపై జిల్లా వ్యాప్తంగా కొంతమంది జిల్లా అధికారుల్లో ఉత్కంఠత నెలకొని ఉండగా అసలు ఏం జరుగుతున్నదో వారికే అర్ధం కావడం లేదు. నెల రోజుల క్రితం పశ్చిమగోదావరిజిల్లా రిజిస్ట్రార్ ఎల్ వెంకటేశ్వర్లు రిజిస్ట్రార్ శాఖలో పనిచేసే కిందిస్థాయి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేదించారనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేశాయి.

ఆ శాఖలో పనిచేసే 11 మంది మహిళా ఉద్యోగులు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు పై జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు కూడా చేశారు. బాధితమహిళా ఉద్యోగులు చేసుకున్న ఫిర్యాదుపై జిల్లా రాష్ట్రస్థాయి అధికారులు కంటితుడుపు చర్యగా ఏలూరు స్తాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డి ఐ జి శివరాం ని విచారణాధికారిగా నియమించారు.

ఈ శాఖలోని పనిచేసే ఉన్నతాధికారిని విచారణాధికారిగా నియమిస్తే నిందితుడు, బాధితులు విచారణాధికారి అందరూ ఒకే శాఖకు చెందినవారు కావడం తో నిజాలను నిర్భయంగా చెప్పనివ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు 11 మంది మహిళలు తమను రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు తమను శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధించిన తీరు పై ఉన్నతాధికారులు ఆయనపై ఇంతవరకు ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటనేది చిక్కుప్రశ్నగా జిలల్లా లో మహిళా ఉద్యోగుల్లో రేకెత్తిస్తోంది.

సదరు రిజిస్ట్రారుపై ఏకంగా 11 మంది మహిళా ఉద్యోగులు తమ పై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని సిగ్గువిడిచి రాతపూర్వకంగా చెప్పుకున్నా న్యాయం జరగలేదు. పట్టించుకున్న నాధుడే లేడని వాపోతున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై  ఒక మగ విచారణాధికారి, అందునా ఇదేశాఖ ఉన్నతాధికారిని విచారణకు నియమిస్తే ఆయనతో  చెప్పుకోలేని పరిస్థితి,  జరిగిన పరాభవాలు, అవమానాలు, రాక్షస చేష్టలు, బలవంతపు క్రియలు అన్ని విడమరిచి చెప్పే పరిస్థితి ఉండదు.

అప్పట్లో ఈ కేసు విచారణను జిల్లా కలెక్టర్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ అనుమతితో మహిళా అధికారులతో విచారణ జరిపిస్తామని అప్పట్లో డి ఐ జి శివరాం తెలిపారు. నెలరోజులు గడిచిపోతున్నా విచారణలో పురోగతి లేకపోవడంపై జిల్లాలో కొంతమంది రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

108 దేశాలలో కనిపించిన మంకీ పాక్స్ వైరస్

Satyam NEWS

నిత్యావసర ధరల పెరుగుదల ఆపలేకపోయిన సీఎం జగన్

Satyam NEWS

క్యాండిల్ లైట్: నిజామాబాద్ లో రేపు నర్సుల ర్యాలీ

Satyam NEWS

Leave a Comment