42.2 C
Hyderabad
May 3, 2024 18: 57 PM
Slider ఖమ్మం

ఖమ్మం అభివృద్ది బాధ్యత నాది

#Khammam

ఖమ్మం నగరాభివృద్ది నా బాధ్యత అని, అందుకు శక్తివంచన లేకుండా గడచిన 9ఏళ్లు నిర్విరామంగా కృషి చేసి నగరాన్ని సుందరంగా ఇంకా చేయాల్సిన బాధ్యత నాపై ఉందని, మరింత అభివృద్ది చేయాల్సిన బాధ్యత నాపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఖమ్మం నగరాభివృద్ది నా బాధ్యత అని, అందుకు శక్తివంచన లేకుండా గడచిన 9ఏళ్లు నిర్విరామంగా కృషి చేసి నగరాన్ని సుందరంగా ఇంకా చేయాల్సిన బాధ్యత నాపై ఉందని, మరింత అభివృద్ది చేయాల్సిన బాధ్యత నాపై ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

ఖమ్మం నగరంలో 11, 47వ డివిజన్ లలో రూ.2కోట్లతో అభివృద్ది పనుల మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.11వ డివిజన్ కవిరాజ్ నగర్ లో SDF నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.47వ డివిజన్ మంచికంటి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో SDF నిధులు రూ.90 లక్షలతో నిర్మించిననున్న సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం సుడా నిధులు రూ.20 లక్షలతో VDF టెక్నాలజతో నిర్మించిన సీసీ రోడ్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన SDF రూ.50 కోట్ల నిధులు మొత్తం కేవలం సైడ్ డ్రెయిన్లు, సీసీ రోడ్స్ కోసమే వినియోగించామని అన్నారు.అభివృద్దే ఎజెండాతో ఇంత పెద్ద మొత్తం లో డివిజన్ల ప్రజల కోసం రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచామని అన్నారు.

కచ్చా రోడ్లు మొత్తం సీసీ రోడ్లు గా మార్చినన్నారు.రూ.10 కోట్లతో కవిరాజ్ నగర్ మజీద్ నుండి చెరువు బజార్ మజీద్ వరకు ఉన్న ప్రధాన మురుగు కాల్వ ను బాగు చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దుర్వాస, మురుగుకు శాస్వత పరిష్కారం చూపించడం జరిగిందని, ఆధునీకరణ అనంతరం అక్కడ ప్రజలకు అవసరమయ్యే పనులు చేపడతామని చెప్పారు.150 కోట్లతో ప్రధాన డ్రైన్ లు అన్నిటికీ 23 కిలో మీటర్ల మేర మురుగు కు శాస్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు.

మంత్రి అయి నాలుగేళ్ల అయిన సందర్భంగా కేటిఆర్ రూ. 100కోట్ల GO ను ఇచ్చి పంపించారు అని తెలిపారు.ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగిన వాడిని కాబట్టే నా ఊరు ను అభివృద్ది చేసుకోవాలి అనే తపన ఉంటుందని, బయట నుండి వచ్చిన వారికి ఆ తపన ఉండదని, మళ్ళీ ఒకసారి BRS ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని తద్వారా మరింత అభివృద్ది జరుగుతుందని వివరించారు.

రూ.690 కోట్లతో మున్నేరు కు ఇరువైపులా త్వరలో నిర్మించనున్న RCC రక్షణ గోడలు నిర్మించి మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.రూ.180 కోట్లతో హైద్రాబాద్ దుర్గంచెరువు మాదిరి నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి తో త్రీ టౌన్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించనున్నదని అన్నారు.కొందరు దొంగ ప్రేమలు ఓలక బొస్తారని వారి మాటలు నమ్మి మోసపోవద్దు అని సూచించారు.మీ కళ్ళ ముందే ఉన్న అభివృద్ధిని చుసి ఓటు వేయండి.. మీ కళ్ళ ముందే ఉన్న పనులు చూసి ఓటు వేయండి.. BRS ప్రభుత్వం ను మళ్ళీ గెలిపించడం ద్వారా ఇంకా అభివృద్ధిని మీరు చూస్తారని చెప్పారు.

Related posts

వలస కార్మికులకు అండగా జన్ సహస్

Satyam NEWS

కరోనా రోగుల సేవలో మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

Murali Krishna

Leave a Comment