23.7 C
Hyderabad
May 8, 2024 06: 18 AM
Slider ఖమ్మం

పట్టపగలు సినీ ఫక్కీలో కిడ్నాప్

#Kidnapping

కొత్తగూడెంలో సినీ పక్కీలో కిడ్నాప్‌ జరిగింది. భర్తపై దాడిచేసి భార్యను ఎత్తుకెళ్ళారు గుర్తు తెలియని దుండగులు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న దంపతులపై జరిగిన దాడిలో భార్తను చితక్కొట్టి భార్యను ఎత్తుకెళ్లారు.ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దీనివెనుకున్న అసలు కుట్ర వెలుగులోకొచ్చింది.

ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెంకి చెందిన గొగ్గెల మాధవి లు కొంత కాలంగా ప్రేమించుకొని ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మాధవి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. మాధవి పరీక్ష రాయడానికి ఖమ్మం నుంచి కొత్తగూడెం ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసి భర్తపై దాడి చేసి భార్య ను బలవంతంగా కార్లో ఎత్తుకెల్లారు దుండగులు.

కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడిచేసి తన భార్యను కిడ్నాప్ చేశారని తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు భర్త సన్ని. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. మాధవి కుటుంబ సభ్యులే కిడ్నాప్‌కు పాల్పడి ఉంటారని సన్నీ అరోపించాడు.

Related posts

రష్యా వ్యాక్సిన్ ఎంత మేరకు రక్షణ కల్పిస్తుందో చూడాలి

Satyam NEWS

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నీలి మీడియా వక్ర భాష్యం

Satyam NEWS

లాక్ డౌన్ పై ప్రజాభిప్రాయం కోరిన మంత్రి

Satyam NEWS

Leave a Comment