28.7 C
Hyderabad
May 5, 2024 08: 45 AM
Slider ప్రత్యేకం

కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు: కిషన్ రెడ్డి

#kishanreddy

కామారెడ్డి ప్రజల చేతిలో తెలంగాణ భవిష్యత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ను ఇక్కడ ఒడిస్తే రజాకార్ల పాలన అంతం అవుతుందన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పొందుర్తి వద్ద భారీగా బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరాచౌక్, ధర్మశాల నుంచి రాజారెడ్డి గార్డెన్ వరకు ప్రచార కార్యక్రమాన్ని తలపించేలా భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ ప్రభుత్వం తెలంగాణకు  లక్షల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. తెలంగాణలో కేంద్రం రోడ్లు వేస్తే కేసీఆర్ వేసినట్టుగా చెప్పుకున్నాడని ఆరోపించారు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి కేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం చేసుకున్నారన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు తనకు మద్దతిస్తే ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటా అని కేసీఆర్ అన్నాడని గుర్తు చేశారు.

కారులో డీజిల్ పొసే పరిస్థితి ఉద్యమం సమయంలో లేదని, ఇప్పుడు దేశానికి ఖర్చు చేసేంత సంపాదించుకున్నారని ఆరోపించారు. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని, 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడని, ప్రస్తుతం కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన మహానుభావుడు సూపర్ ఇంజనీర్ గా మారి వేసిన డిజైన్ కాళేశ్వరం అని ఎద్దేవా చేశారు. 1969 లో 365 మంది విద్యార్థులు నాటి కాంగ్రెస్ ప్రభిత్వం పిట్టలను కాల్చినట్టు కాల్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని, మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.

త్యాగాల చరిత్ర ఉన్న తెలంగాణలో  ఫార్మ్ హౌస్ లో ఉండేందుకు కేసీఆర్ ను గెలిపించాలా.. అవినీతి చేయడం కోసమా.. కుటుంబ పాలన కోసమా ప్రజలు ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ లో నాటి ఉద్యమకారులు లేరన్క్, ఉద్యమ ద్రోహులు మాత్రమే ఉన్నారని అన్నారు. అసదుద్దీన్ ను ఒక భుజం మీద, అక్బరుద్దీన్ ను మరొక భుజం మీద ఉంటే వారికి వంగివంగి దండాలు పెడుతున్నాడన్నారు. కేసీఆర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా రిమోట్ ఒవైసీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. రజాకార్ల వారసత్వంతో వచ్చిన పార్టీ మజ్లీస్ అని పేర్కొన్నారు.

కామారెడ్డికి బంగారు కామారెడ్డి చేస్తామని ఇక్కడికి వస్తున్నారా కేసీఆర్ అని ప్రశ్నించారు. గజ్వేల్ లో రెండు సార్లు గెలిచిన కేసీఆర్ అక్కడే ఫార్మ్ హౌస్  కట్టుకున్నాడని, పదేళ్ళలో ప్రజలను ఒక్కసారి కూడా కలవలేరన్నారు. ఆయన చేసుకున్న సర్వేల్లో ఒడిపోతానని తెలిసి ఇక్కడికి వచ్చాడన్నారు. తెలంగాణలో నీతి నిజాయితీని గెలిపించాలని, మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో 5 లక్షఓ కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తే రైతు రుణమాఫీ వేష్ట అని నిన్న అంటున్నారని, ఇన్నేళ్ళుగా కేసీఆర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. 9 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు భర్టీ చేయని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. టీఎస్పీఎస్సి ద్వారా 18 పరీక్షలు రద్దయ్యాయని, 30 లక్షల విద్యార్థుల పాలిట పబ్లిక్ కమిషన్ ప్రశ్నార్థకం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎస్పీఎసీ ప్రక్షాళన చేయడం కాదని, ఈ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ప్రక్షాళన చేస్తారని హెచ్చరించారు. మాట తప్పితే అలా నరుక్కుంటా అని చెప్పిన కేసీఆర్ కు బీఆర్ ఎస్ పార్టీ తల ఈ ప్రజలు నరుకుతారన్నారు. కామారెడ్డిలో బెల్లం తయారు చేసి అమ్ముకునే రైతుల పొట్ట కొట్టారని, నిజాంషుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మోసం చేశారని తెలిపారు. ఏళ్ల తరబడి కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న పసుపుబోర్డు హామీ నెరవేర్చిన ఘనత బీజేపీదన్నారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఎన్నికోట్ల ఖర్చు పెట్టిన్నా ఇక్కడి ప్రజలు అమ్ముడుపోయేవాళ్ళు కాదన్నారు. కేసీఆర్ కు ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, డబ్బు, అధికార దుర్వినియోగం, మజ్లీస్ పార్టీ మీద కేసీఆర్ కీ నమ్మకం ఉందన్నారు.

కామారెడ్డి ప్రజలు అంగట్లో పశువులు కాదని, పులిబిడ్డలు అని నిరూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో మార్పు కామారెడ్డి నుంచే రావాలన్నారు. ఈటెల రాజేందర్ ఈటెలు పట్టుకుని గజ్వేల్ వెళ్ళాడని, రెండింటిలో ఒకచోట అయినా గెలుస్తానో లేదో అని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో వెంకట రమణారెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఓడిపోతే ప్రజలకు కష్టాలు తప్పవు అనే మాటలో నిజం ఉందొ లేదో తెలియదు కాని బీఆర్ఎస్ కు మాత్రం కష్టాలు తప్పవన్నారు.

తెలంగాణలో నీళ్లు దొరకవు గాని ప్రతి గాలిలో లిక్కర్ మాత్రం దొరుకుతుందని, 50 ఓట్లకు ఒక బెల్టు షాప్ ఉందని, మద్యం తెలంగాణగా మార్చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీతో తస్మాత్ జాగ్రత్త అని దానికి ఓటు వేస్తే పెనం మిడి నుంచి పోయిలో పడ్డట్టేనన్నారు. 75 సంవత్సరాలు దేశాన్ని దోచుకుంది కాంగ్రెస్ అని, ఓటు బ్యాంకు రాజకీయాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని దుర్మార్గ పాలన చేసిందన్నారు. కాంగ్రెస్ కూడా కుటుంబ పాలనే చేసిందని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు, కేసీఆర్ కు వేసినట్టేనన్నారు.

గతంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులిస్తున్నారని, గెలిచిన తర్వాత తమ పార్టీలో చేర్చుకోవడానికి వీలు చేసుకుంటున్నాడన్నారు. తెలంగాణలో భూములు, రింగు రోడ్డు అమ్ముకున్నారని, ఆరు నెలల ముందే వైన్స్ టెండర్లు పెట్టారన్నారు. తెలంగాణ బాగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, అప్పుడే తెలంగాణ బాగుపడుతుందని పేర్కొన్నారు. గ్యారెంటీలు పేరుతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అక్కడ ప్రజలు కరెంట్ లేక ధర్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ అంటే దరిద్రం, శని అని, ఆ శని తెలంగాణ నెత్తిమీద పెట్టుకుంటే ప్రజలు ఆగం అవుతారన్నారు. బీజేపీ గెలిచాక ఫార్మ్ హౌస్ సీఎం ఉండడని, ప్రతి రోజు ప్రజలను కలిసే సీఎం ఉంటాడన్నారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రాజ్యాంగం ప్రకారం బీజేపీ పాలన ఉంటుందని తెలిపారు. మోడీ పాలనలో నీతివంతమైన పాలన అందిస్తామని, బిసి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో బిసి ముఖ్యమంత్రి లేరని, బిసి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. బిసిలు రాజకీయ సంకెళ్లు, గోడలు బద్దలు కొట్టుకుని బయటకు రావాలని పిలుపునిచ్చారు. 50 శాతం ఉన్న బిసిలకు సీఎం అయ్యే అవకాశం లేదా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో కేసీఆర్ మీద వెంకట రమణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేయించే బాధ్యత తనదేనన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానానికి భారీ విరాళం

Satyam NEWS

బ‌ల్దియా రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు వైద్య బీమా సౌక‌ర్యం

Satyam NEWS

ఆర్ఆర్ఆర్ తో బాటు టీవీ5, ఏబీఎన్ పై కూడా పోలీసు కేసు

Satyam NEWS

Leave a Comment