30.7 C
Hyderabad
April 29, 2024 03: 50 AM
Slider జాతీయం

లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల భారీ ర్యాలీ

#delhi

పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించి పోస్టులను భర్తీ చేయాలి

ఢిల్లీలో శుక్రవారం లక్షలాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు భారీ ర్యాలీ నిర్వహించి రామ్ లీలా మైదానంలో బహిరంగ సభలో పాత పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ప్రభుత్వ రంగ సంస్థలతో సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారని ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ తెలిపారు.

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.జి.ఈ.ఎఫ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ & వర్కర్స్ (సీ.సీ.జీ.ఈ.డబ్లూ), స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్.టీ.ఎఫ్.ఐ), పెన్షనర్ల అసోసియేషన్, సీ.సీ.జీ.జీ.ఓ.ఓ, ఇన్కమ్ టాక్స్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలను ఆపాలని, ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించాలని, 8వ కేంద్ర వేతన కమీషన్ ను ఏర్పాటు చేయాలని, 18 నెలల డి.ఏ/ డి.ఆర్ బకాయిలను విడుదల చేయాలని, కారుణ్య నియామకాలకు అడ్డంకులను తొలగించాలని నినదించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లనుండి ఎన్.జీ.ఓ అసోసియేషన్లు, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టి.ఎఫ్), ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా), పోస్టల్ తదితర సంఘాల నుండి వేలాది మంది ఢిల్లీ భారీ ర్యాలీలో పాల్గొని తమ న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని, లేనట్లయితే నిరవధిక సమ్మెతో సహా తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎన్.పి.ఎస్ ను రద్దు చేసి, సీ.సీ.ఎస్ పెన్షన్ రూల్స్, 2021ను అందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, టీచర్లు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సిబ్బందికి వర్తింప చేసి పాత పెన్షన్ స్కీమును ( ఓ.పి.ఎస్) పునరుద్ధరించాలని, క్యాజువల్, కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్, డైలీ వేతనాల కార్మికులను పర్మినెంట్ చేయాలని, వేతన సవరణ జరపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని వి. కృష్ణ మోహన్ డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

కొల్లాపూర్ నియోజకవర్గ వాల్మీకి ఐక్యకార్యాచరణ కమిటీ కరపత్రం విడుదల

Satyam NEWS

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

Satyam NEWS

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment