28.2 C
Hyderabad
June 14, 2025 11: 05 AM
Slider నల్గొండ

పెట్టుబడి-పదవి-సంపాద: ఇదేనా రాజకీయం?

kodandaram

సూర్యాపేటలో జరిగిన టిజేఎస్‌ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పాల్గొన్నారు. ఈ రోజు సుర్యాపేట సమావేశంలో విలేకరులతో కొదండరాం మాట్లాడారు. ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో రాజకీయాలు బలహీన పడ్డాయని కొదండరాం అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారంగా మారి ఎంత పెట్టుబడి పెట్టి ఎంత సంపాదించుకున్నామనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని కొదండరాం విమర్శించారు. సమాజంలో ఉన్న సమస్యలపై చర్చించి పోరాడే శక్తి రాజకీయాలకు లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు అప్రజాస్వామిక ధోరణిలో ఉన్నాయని కోదండరాం ఆరోపించారు.

రాబోయే మున్సిపల్‌ ఎన్నికలు వ్యాపారం కారాదని ఆయన అన్నారు. సమస్యలపై నిజాయితీగా పోరాడే నిజాయితీగల వ్యక్తులనే ప్రజలు ఎన్నుకోవాలని ప్రజలకు కోదండరాం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related posts

ముగిసిన డేటా విజువలైజేషన్ సంబంధిత అంశాల సదస్సు

Satyam NEWS

చర్లపల్లి ఈసీ నగర్‌ లో ఈసీఐఎల్‌ సొసైటి స్థలం కబ్జాకి యత్నం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఎన్నికలను రద్దు చేస్తున్న మరిన్ని రాష్ట్రాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!