40.2 C
Hyderabad
May 6, 2024 18: 08 PM
Slider తెలంగాణ

ఒంటెద్దు పోకడ మాని కార్మికులతో చర్చలు జరపాలి

kodanda

ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపించడం సరికాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. వారి డిమాండ్లను పరిశీలించి, పరిష్కరిస్తామనే హామీనివ్వాలని సూచించారు. కానీ ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుందని కోదండరాం చెప్పారు. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వారి సమస్యలపై సానుకూలంగా వ్యహరించాలని హైకోర్టు సూచించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూనే కార్మికులు పోరాడుతున్నారని చెప్పారు. తమ హక్కుల కోసమే కార్మికులు పాటుపడుతున్నారని కోదండరాం చెప్పారు. వారి బాధను కేసీఆర్ అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. తమ డిమాండ్ల కోసం కార్మికులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే కార్మికులు 46 రోజులుగా సమ్మె చేయడం అరుదు అని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను ప్రశ్నించే పరిస్థితులు కూడా లేని సమయంలో కార్మికులు సమ్మె చేసి తమ సత్తా ఏంటో చాటారని తెలిపారు. తమ డిమాండ్లు ఏంటో ప్రజలకు తెలియజేయడంలో కార్మికులు విజయం సాధించారని.. వారిని అర్థం చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరుపాలని కోరారు. పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు.

Related posts

కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితోనే ప్రభుత్వం పనిచేస్తుంది

Satyam NEWS

ఈ నెల 30 నుంచి శ్రీ శేష దాసుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS

సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment