ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. కార్మికుల సమ్మె దురహంకార పూరితమన్న ఆయన వ్యాఖ్యలను కోదండరాం ఖండించారు. కార్మికులకు డెడ్‌లైన్ విధించడం, భవిష్యత్ ఉండదంటూ హెచ్చరించడం లాంటి ఫత్వాలు జారీ చేయడం మానుకోవాలన్నారు. యూనియన్లు, నిరసనలు లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదే కాదని కోదండరాం అన్నారు. అవి లేకుంటే కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని, ఆ విషయాన్ని కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని కోదండరాం హితవు పలికారు.
previous post