38.2 C
Hyderabad
May 2, 2024 19: 20 PM
Slider ఆధ్యాత్మికం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలల్లో భక్తుల కోసం తలంబ్రాలు

#ontimitta

కడప  జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను టిటిడి వైభవపేతంగా నిర్వహిస్తుంది. శ్రీవారి సేవకుల ద్వారా తలంబ్రాల తయారీ ప్రారంభించింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15న జరగనున్న సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తలంబ్రాలను డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ కు అందజేశారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు తలంబ్రాలు, ముత్యం, కంకణం పంపిణీ చేస్తారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులతో రెండు లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నది టిటిడి.

Related posts

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్

Satyam NEWS

ఎస్.సి, ఎస్.టి యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి

Satyam NEWS

వైసీపీ అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్నికల బహిష్కరణ

Satyam NEWS

Leave a Comment