ఎన్నో దశాబ్దాల కలగా ఉన్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ట్రయల్ రన్ ప్రారంభం అయింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు వద్ద ట్రయల్ రన్ ను నేడు సి. ఆర్. ఎస్. రామ్ కృపాల్ ప్రారంభించారు. నేడు న్యూ పిడుగురాళ్ల స్టేషన్ నుండి రొంపిచర్ల వరకు ట్రైల్ రన్ నడిచింది. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే లైన్ పల్నాడు ప్రాంతంలో అత్యంత కీలకమైనది. ఎన్నో దశాబ్దాలుగా ఈ రైల్వే లైన్ కోసం ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. న్యూ పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ నుంచి రొంపిచర్ల మధ్య ట్రయల్ రన్ నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.