29.7 C
Hyderabad
May 2, 2024 03: 36 AM
Slider ప్రత్యేకం

జర్నలిస్టుపై కొల్లాపూర్ ఎమ్మెల్యే కక్ష సాధింపు

ktr beeram

ప్రజాస్వామ్యయుతంగా మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులను బెదిరించడం కరెక్టా? పోటీ చేస్తున్న అభ్యర్ధులను లోబరుచుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యవాదులు హర్షిస్తారా? అయితే కొల్లాపూర్ మునిసిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మనుషులు అదే పనిలో ఉన్నారు.

కొల్లాపూర్ మునిసిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ సక్రమంగా ప్రచారం చేయడం లేదని, ప్రజలను ఆకట్టుకునే రీతిలో ప్రచారం చేసి మంచి ఫలితాలు సాధించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ని హైదరాబాద్ కు పిలిచి మరీ చెప్పారు.

సత్యం న్యూస్ అదే వార్తను ప్రజల ముందు ఉంచింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తో బాటు మునిస్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారని ఫొటో తో సహా సత్యం న్యూస్ వార్త ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సలహాను పాటించడం చేతకాని వారు సత్యం న్యూస్ ప్రతినిధిని టార్గెట్ గా చేసుకున్నారు.

కొల్లాపూర్ పోలీసులపై వత్తిడి తీసుకువచ్చి సత్యం న్యూస్ ప్రతినిధి ఔట రాజశేఖర్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచారు. వార్తలో తప్పు ఉంటే సంబంధిత వ్యక్తులు ఖండన పంపించడం ఆనవాయితీ. సత్యం న్యూస్ లో వచ్చిన వార్తను కొల్లాపూర్ ఎమ్మెల్యే ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే జర్నలిస్టు రాజశేఖర్ సతీమణి చైతన్య కొల్లాపూర్ మునిసిపాలిటీలోని 11వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

ఎస్ సి రిజర్వుడు వార్డు నుంచి ఒక మహిళ పోటీ చేస్తుంటే అందరూ చేయూతనిచ్చి ఎస్ సిలలో వచ్చిన చైతన్యాన్ని కాపాడాలి. అయితే అధికారమే పరమావధిగా పని చేసే కొందరు నాయకులకు ఒక ఎస్ సి మహిళ లో ఇంత చైతన్యం రావడాన్ని చూడలేకపోతున్నారు. ఆ మహిళ కూడా ఒక జర్నలిస్టు భార్య కావడంతో వారికి పుండుమీద కారం చల్లినట్లుగా అనుకుంటున్నారు.

తన భార్యను పోటీ నుంచి విరమింప చేయాలని, అలా చేసేది ఉంటే ఎమ్మెల్యేతో తాను మాట్లాడతాని ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ప్రతిపాదించాడు. (ఆడియో కాల్ రికార్డింగులు ఉన్నాయి) అయినా జర్నలిస్టు భార్య పోటీ నుంచి తప్పుకోలేదు. దాంతో సత్యం న్యూస్ రాసిన వాస్తవ రిపోర్టుపై జర్నలిస్టును సాధించడం ఎమ్మెల్యే వర్గీయులు మొదలు పెట్టారు.

Related posts

తిరుమలలో సులభంగా దర్శనం చేసుకోవడానికి మార్గాలు

Satyam NEWS

అనుకోని ఆపద వచ్చింది… ఆదుకుంటారా!

Bhavani

బీసీ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment