28.7 C
Hyderabad
April 28, 2024 03: 21 AM
Slider తూర్పుగోదావరి

అనుకోని ఆపద వచ్చింది… ఆదుకుంటారా!

#Unexpected danger

ఆ బాలికకు ఆనుకోని ఆపద వచ్చింది… అప్పటి వరకు పాఠశాలలో ఎంతో సరదాగా ఆడుకుంటూ ఇంటికి వచ్చిన ఆ బాలికకు అనారోగ్యం పాలైంది.. జ్వరం వచ్చి మంచాన పడింది.. ఇక అప్పటి నుంచి కన్న కుతుర్ని కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నం లేదు…మొక్కని దేవుడు లేడు.. కుతురు చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో… తన కూతురు చికిత్స కు మనస్సున్న దాతలు ఆర్థిక సహాయం చేయాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు..

ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరమ్మ గుంట గ్రామం వెంకటాపురంలో ని కర్నాటి పోతురాజు, వెంకటేశ్వరమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.. పెద్ద కూతురు వెంకటలక్ష్మి, చిన్న కూతురు వెంకటనాగ ఆమని… తనకున్న అర ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కూతురు వెంకటనాగ ఆమని తొమ్మిదవ తరగతి చదువుతోంది. గతేడాది సెప్టెంబర్ లో పాఠశాలకు వెళ్లి వచ్చిన తరువాత జ్వరం వచ్చింది.

స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు….ఆ తర్వాత యూరేన్ బంద్ అయ్యి పరిస్థితి సీరియస్ అవ్వటంతో విజయవాడలో ని పిన్నమనేని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ లక్ష రూపాయలు ఖర్చు చేశారు.. అయినా ఫలితం లేదు… అక్కడ నుంచి తమిళనాడులోని సీఎంసీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.. రెండు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు.. తన కూతురుని బతుకించుకునేందుకు తనకున్న అర ఎకరం పొలాన్ని అమ్మి 23 లక్షలు ఖర్చు చేశారు.. తన కూతురుకి కిడ్నీ ఇచ్చేందుకు తండ్రి పోతురాజు సిద్దమైయ్యాడు. అన్ని మ్యాచ్ అయ్యాయి.. అనుమతులు వచ్చాయి..

శాస్త్ర చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యలు తెలిపారు కానీ ప్రస్తుతం అతని వద్ద డబ్బులు లేకపోవడం వల్ల దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.. దయగల దాతలు అపన్న హస్తం అందించి తన కూతురు శాస్త్ర చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు అభ్యర్ధిస్తున్నారు..

Related posts

తెలంగాణ లో బదిలీల జీవోపై హైకోర్టు స్టే

Sub Editor 2

మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి

Satyam NEWS

జగన్ టిక్కెట్ల విక్రయంపై ఒక వర్గం సినీ నిర్మాతల అంగీకారం

Satyam NEWS

Leave a Comment