35.2 C
Hyderabad
April 30, 2024 23: 26 PM
Slider మహబూబ్ నగర్

బర్త్ డే గిఫ్ట్: శాంతిభద్రతలకు చిహ్నంగా పచ్చని మొక్క నాటిన సీఐ

kollapur police

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కొల్లాపూర్ పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. హరితహారంలో భాగంగా  శాంతిభద్రతలకు చిహ్నంగా  కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్  బి.వెంకట్ రెడ్డి పచ్చని మొక్కలు నాటి ప్రకృతికి అందాలను ఇచ్చారు.

సోమవారం రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాలలో మొక్కలు నాటారు. సర్కిల్ పరిధిలోని పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కేంద్రం ఆవరణంలో సీఐ బి.వెంకట్ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. స్థానిక ఎసై, ఎఎసై హెడ్ కానిస్ స్టేబుల్స్ హోమ్ గార్డ్స్ అందరూ మొక్కలు నాటారు. ప్రతి పోలీస్ స్టేషన్  కేంద్రలలో సుమారు 50 దానిమ్మ, జామ, ఉసిరి, మామిడి, పూల మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా సిఐ బి.వెంకట్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర డిజిపి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాలలో ఎసై, ఎఎసై లతో పాటు సిబ్బంది అందరూ హరితహారం పాల్గొన్నారని అన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు చల్లని నీడనిచ్చే చెట్టులా ఉండాలన్నారు. మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Related posts

A big game: కొల్లాపూర్ రాజకీయానికి అన్నీ ప్రత్యేకతలే

Satyam NEWS

బ్రుటల్ యాక్షన్:మహిళను స్తంభానికి కట్టి చెప్పులతో కొట్టారు

Satyam NEWS

వన దేవతల ఉనికిని ప్రశ్నిస్తున్న వాచాలుడు

Satyam NEWS

Leave a Comment