29.7 C
Hyderabad
May 2, 2024 06: 20 AM
Slider నల్గొండ

నల్లగొండ ప్రజల ఉసురు కేసీఆర్ కు తాకుతుంది

#KomatireddyVenkatreddy

ముఖ్యమంత్రి కేసీఆర్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.బ్రాహ్మణవెల్లంల, ఎస్ ఎల్ బి సి ప్రాజెక్ట్ ల పై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. నల్లగొండ ప్రజల ఉసురు కేసీఆర్ కి తగులుతుందని కోమటిరెడ్డి విమర్శించారు.

మానవత్వమే లేని వ్యక్తిగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడని, కేసీఆర్ పాలనలో రైతులు అన్నమో రామచంద్రా అని అలామటిస్తున్నారని అన్నారు. ఉత్తర తెలంగాణ లో అటవీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వర్షపాతం ఎక్కువగా ఉంటుందని, దక్షిణ తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉంటుంది ఇక్కడ చాలా ప్రాంతాలు ఎడారిగా మారాయని అన్నారు.

ప్రాజెక్టులు అవసరమున్న దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ గాలికి వదిలేశాడని విమర్శించారు. కాళేశ్వరం వల్ల కేసీఆర్ కి తప్ప రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కాళేశ్వరంకి లక్ష కోట్లు ఖర్చు పెట్టి వరద నీటిని లిఫ్ట్ చేసి సముద్రంలోకి వదిలారని దుయ్యబట్టారు.

ఉత్తరా తెలంగాణ లో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ దక్షిణ తెలంగాణలో మాత్రం కనీసం 3వేల కోట్లు కూడా ఖర్చు పెట్టడం లేదని ఆరోపించారు. ఎడారిగా ఉన్న నల్లగొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలని  బ్రాహ్మణవెల్లంల , ఎస్ ఎల్ బి సి  ప్రాజెక్ట్ లకు కాంగ్రేస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టి 70 శాతం పూర్తి చేయించగా ఈ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

కేవలం 200 కోట్ల తో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. 100 చెరువులు నిండుతాయి భూగర్భజలాలు పెరిగి రైతులు నాలుగు పంటలు పండిస్తారని ఆయన అన్నారు. రైతుల కోసం శాసనసభ లో ముఖ్యమంత్రి కి కనీసం 50 సార్లు చెప్పాను, కోప్పడ్డాను అయిన ప్రయోజనం లేకుండా పోయిందని, పాత ప్రాజెక్ట్ ల పనులు పూర్తి చేస్తే కమిషన్లు అందవని కేసీఆర్ ఆలోచిస్తున్నాడని, ప్రాజెక్టు లు పూర్తి అయితే కోమటిరెడ్డి కి పేరు వస్తుందని కేసీఆర్ కక్షసాధింపు చర్యలు చేస్తున్నాడని అన్నారు.

పాదయాత్ర కి అనుమతి కోరితే ప్రాజెక్టులు జూన్ కల్లా పూర్తి చేస్తాం ఇంకా పాదయాత్ర దేనికి అని అన్న కేసీఆర్ సెప్టెంబర్ నెల వచ్చినా ఎక్కడి పనులక్కడే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ కి రైతుల పాపం తగులుతుందని, ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని కోమటిరెడ్డి అన్నారు.

Related posts

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

Bhavani

ప్రకాశం జిల్లా సమస్యలపై ప్రధాని సానుకూల స్పందన

Satyam NEWS

టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన

Satyam NEWS

Leave a Comment