29.7 C
Hyderabad
May 3, 2024 05: 14 AM
Slider ముఖ్యంశాలు

టమాటా తో కోటేశ్వరులు

#tomato

టమాటా సాగుతో కోటీశ్వరులుగా మారిన ఇద్దరు రైతులు. వ్యవసాయంతో కోట్లు ఆర్జించిన రైతులు అరుదు. కానీ దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు నెల కాలంలోనే ఇద్దరు రైతులను కోటీశ్వరులను చేశాయి.మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్‌ 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది.

దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో విక్రయించారు. ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ సాహూ 150 ఎకరాల్లో టమాటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. రూ.కోటికి పైగా ఈ నెల కాలంలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి దిగారు.

Related posts

అక్రమ అరెస్ట్ లతో జూపల్లి అనుచరుల పోరాటాలను ఆపలేరు

Bhavani

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం

Satyam NEWS

కరోనా ఎలర్ట్: కరోనా తో బ్యాంకు మేనేజర్ మృతి

Satyam NEWS

Leave a Comment