Slider నల్గొండ

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Jakkula-1

కరోనా మహమ్మారి రెండవ దశ పట్ల ప్ర‌జ‌లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హుజుర్ నగర్ మున్సిపాలిటి వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా ఆసుప‌త్రిలో ఆయ‌న కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించ‌కున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్టణాలే కాక పల్లెలకు శరవేగంగా విస్తరిస్తోంద‌ని ప్రజలు అప్రమత్తంగా ఉంటే క‌రోనాను ఎదుర్కోగ‌ల‌మ‌ని, మాస్కులు ధరించి, చేతులు తరచుగా సబ్బుతో పరిశుభ్రంగా క‌డుక్కోవాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని కరోనాను అరిక‌ట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

మండల పరిధిలోని ఏరియా ఆసుప‌త్రి హుజూర్ నగర్, లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తున్నార‌న్నారు. ఆరోగ్య పరీక్షా కేంద్రాలలో పాజిటివ్ గా నిర్ధార‌ణ అయితే వారికి అక్కడికక్కడే మందులు అంద‌జేస్తున్నార‌న్నారు. కరోనా సోకిన రోగులపై వారి కుటుంబులు, బ‌య‌టి వ్య‌క్తులు కానీ వివక్ష చూప‌రాద‌న్నారు. మీకు తోచిన సహాయం చేయాలని సూచించారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించే అవసరమైన ఆహారం చేపలు, మాంసము, సి విటమిన్ అధికంగా లభించే నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, వంటి రసాలను అధికంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీఆర్ఎస్‌ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లం కొండ అమర్, హుజుర్ నగర్ హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, రేణుక, గురుప్రసాద్, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గజ్వేల్ లో బీసీ బంధు పంపిణీ

Bhavani

మాస్టర్ ప్లాన్ పేరుతో ఎమ్మెల్యేలు భూములు లాక్కుంటున్నారు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Satyam NEWS

Leave a Comment