40.2 C
Hyderabad
April 29, 2024 18: 02 PM
Slider మెదక్

గజ్వేల్ లో బీసీ బంధు పంపిణీ

#Harish rao

కులవృత్తులను ప్రోత్సహించేందుకు బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదరెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి ,స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వృత్తిని నమ్ముకుని ఆధారపడ్డ కులాలకు ఆర్థిక సాయం అందించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. గతంలో కూడా ఇచ్చేవారు కాకపోతే అది అప్పుగా ఇచ్చేవారు. దానికి బ్యాంకుల చుట్టూ తిరిగి ష్యూరిటీ పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే ఉచితంగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీసీ కులాల్లో అన్ని కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారు. ముదిరాజు, బెస్త, గీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, గౌడ్, యాదవ సోదరులు ఇలా అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించారు.

కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు బిసీలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి అని అన్నారు. గీత, చేనేత, మత్స్య కార్మికులకు ప్రమాద బీమా, వృత్తినే జీవనాధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న ఆయా వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నది. గౌడ సోదరులకు తాటి చెట్లపై పన్ను రద్దు చేయడమేగాక, పాత బకాయిలనూ మాఫీ చేసింది.

లైసెన్సు కాలపరిమితిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు అండగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. చేనేత మిత్ర పథకం ద్వారా సబ్సిడీ కల్పిస్తున్నాం. తెలంగాణకు పూర్వం కేవలం 19 బీసీ గురుకులాలు, 7580 విద్యార్థులు ఉంటే, నేడు 310 బీసీ గురుకులాల్లో 2022-23లో 33స్కూళ్లను,15 డిగ్రీకాలేజీలు నూతనంగా ఏర్పాటు చేసి, పాతవాట్లో 119 జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసాం అన్నింట్లో కలిపి 1,81,880 విద్యార్ధులు ఉన్నారు. బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలు ఇవి అని ఆయన తెలిపారు.

Related posts

సినిమా వైపే అడుగులు వేస్తున్న జనసేన అధినేత

Satyam NEWS

క‌ర్త‌వ్య దీక్ష‌లో ఆమె దిట్ట‌..విదుల నిర్వ‌హ‌ణ‌లో “తగ్గేదేలే”….!

Satyam NEWS

అరాచకపాలనకు వ్యతిరేకంగా లోకేష్ తొలిఅడుగు

Bhavani

Leave a Comment