33.2 C
Hyderabad
May 12, 2024 13: 37 PM
Slider నిజామాబాద్

150 కోట్లతో కేపీఆర్ ట్రస్ట్ జనసేవ ఏర్పాటు

#katipalli

కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కోసం 150 కోట్ల రూపాయలతో తన తండ్రి కేపీఆర్ పేరుతో కాటిపల్లి రాజారెడ్డి (కేపీఆర్) జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించానని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి తెలిపారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో కేపీఆర్ జనసేవ ట్రస్ట్ కామారెడ్డి నియోజకవర్గ మేనిఫెస్టో బుక్ విడుదల చేసారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. పేద ప్రజల సౌకర్యార్థం గత ఐదేళ్లలో ప్రజల మధ్య గమనించిన విషయాలను క్షుణ్ణంగా గమనించి రెండున్నారేళ్లుగా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేయడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఈ మేనిఫెస్టో అమలు చేస్తానని పేర్కొన్నారు. మరో వారం రోజుల తర్వాత ఈ మేనిఫెస్టో ప్రకటిస్తే రాజకీయం అవుతుందని ముందే రిలీజ్ చేస్తున్నానని తెలిపారు.

150 కోట్లతో చేపట్టే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం, విద్య అందించేందుకు ప్రతి మండలంలో ఆస్పత్రి, విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆస్పత్రిలో ఒపి ఐపి సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని, ఒక ఫిజిషియన్ వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. కామారెడ్డి పట్టణంలో పట్టణ, రూరల్ మండలానికి సంబంధించిన ప్రజల కోసం కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా 18 కోట్ల వ్యయంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేస్తామన్నారు. మండల కేంద్రాల్లో మహిళలకు ఉపాధి శిక్షణ కేంద్రం, క్రీడా శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రం, ప్రతి గ్రామంలో రైతు కల్లాల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

నియోజకవర్గంలోని 98 గ్రామాల్లో 222.20 ఎకరాలు , 23.83 లక్షల చదరపు అడుగుల ప్రభుత్వ భూములలో ప్రభుత్వ అనుమతితో 75 కోట్ల వ్యయంతో కల్లాల నిర్మాణం ఉంటుందని, ఇందులో రైతులకు సేద తీరేందుకు షెడ్, బోరు మోటార్ తాగడానికి నీటి సౌకర్యం ఉంటుందన్నారు. రైతు సేవ కేంద్రాల్లో రైతులు ఏ పంట వేసినా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులకు కావాల్సిన విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతు సేవ కేంద్రం ద్వారా వచ్చే ఆదాయం రైతు నిధిగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ నిధి నుంచి అవసరమైన రైతులకు రుణ సదుపాయం అందిస్తామన్నారు.

ఇవన్నీ ప్రతి మండలంలో ఆరున్నర ఎకరాల్లో ఒకే చోట అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వీటన్నిటికీ సుమారు 150 కోట్ల వరకు అంచనా వేయడం జరిగిందని, ఈ డబ్బు తన ఆస్తులను విక్రయించి ట్రస్ట్ కు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 2 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. రైతు కల్లాల కోసం ప్రభుత్వం భూములను ఇస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ రైతుల సౌకర్యార్థమే కల్లాల ఏర్పాటని, దానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే తామే భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తానన్నారు.

ఇవన్నీ ఏర్పాటు తరవాత ప్రజల సౌకర్యార్థం ఆసక్తి ఉన్న వారి నుంచి నిధులను సేకరిస్తామని తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతాయని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సంక్రాంతి లోపు మేనిఫెస్టో అమలుకు కృషి చేస్తానని, ఏడాది లోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తాను గెలిచినా ఓడినా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు

Related posts

సెల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి టాప్: జిల్లా ఎస్పీ సిందూశర్మ

Satyam NEWS

ములుగు లో జెండా పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

Satyam NEWS

క్ష‌య‌ ర‌హిత స‌మాజ నిర్మాణానికి కృషి

Satyam NEWS

Leave a Comment