
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. యువతను ఉర్రూతలూగించిన కన్నడ భామ కృతి శెట్టి నగరంలో సందడి చేసింది. విజయనగరానికి సమీపంలో ని గుంకలాం లో హైడ్ పార్క్ వెంచర్ వారు ఏర్పాటు చేసిన లే ఔట్ లో హైడ్ పార్క్ కి సం బంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్ బ్రోచేర్స్ నటి విడుదల చేసింది.
ప్రముఖ వ్యాపారవేత్త పైడా కృష్ణ ప్రసాద్,విజయ నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. .కృతి శెట్టిని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను నటించిన ఉప్పెన, శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు సినిమాలకి ఇంతటి భారీ విజయాని చేకూర్చిన అభిమానుల కు రుణపడి ఉంటానని అన్నారు.”మీరు ముసలొలు కాకూడదు” అంటూ ఆమె వేసిన డయలాగ్ తో ఒక్కసారి గా అభిమానులు కేరింతలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు.
హైడ్ పార్క్ రియల్ ఏస్టేట్ యజమాని రవి మాట్లాడుతూ అన్ని సదుపాయాలతో కూడిన ఇలాంటి వెంచర్ వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రైట్ ఫ్యూచర్ సంస్థకు ఆర్థిక సహాయంగా నిర్వాహకులు లక్ష రూపాయల చెక్కును డిప్యూటీ మేయర్ మేయర్ కోలగట్ల శ్రావణి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ గ్రూప్ అధినేతలు తాడి ఆదిరెడ్డి, మల్లిడి సోమిరెడ్డి, వేంపడాపూ సూర్య నారాయణ, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.