26.7 C
Hyderabad
May 3, 2024 10: 50 AM
Slider మహబూబ్ నగర్

అందరికి అండగా ఉండే మాజీ మంత్రి జూపల్లికి పోలీసు ‘‘పోటు’’

#jupallykrishnarao

అధికారం పడగ విప్పి బుసలు కొడుతున్నది….. తన మన పర బేధం లేకుండా వ్యవహరిస్తున్నది. స్వార్థం… స్వార్ధం… స్వార్ధం తప్ప కనీస మర్యాదలు కూడా పాటించిన రాజకీయం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో నడుస్తున్నది. తెలంగాణ కోసం ఉన్న పదవులు వదులుకుని వచ్చిన మాజీ మంత్రి, కొల్లాపూర్ వాసులకు ఆప్తుడు అయిన జూపల్లి కృష్ణారావు ను కూడా ‘‘రాజకీయం’’ వదల్లేదు.

కనీసం ఆయన అనుభవించిన హోదాలకు, చేసిన సేవలకు కూడా గౌరవం దక్కలేదు సరికదా ఆయన పై పోలీసు కేసు నమోదు కావడం కొల్లాపూర్ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఆయన ఏదో నేరం చేసి  ఉంటే… కేసు పెడితే… ఎవరూ పెద్దగా ఆలోచించేవారు కాదు….. ఆయనపై ‘‘అధికారం’’ కేసు పెట్టించింది. తనకు ఏనాడైనా అడ్డు వస్తారనుకున్న వారిని అడ్డుతొలగించుకునే చేష్టలుగా ఈ ఘటనను స్థానిక ప్రజలు చూస్తున్నారు.

అడ్డు వచ్చిన వారిని తొలగించుకునే వ్యూహమా?

కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో  అధికారాలను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చెప్పనక్కరలేదు. అడ్డు ఉన్న వారిని తొలగించు కోవడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరుగా దాడులు చేయకుండా పోలీస్ స్టేషన్ లో దాడులు చేయిస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికి తెలిసిందే. మొత్తానికి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలన్నా వెంటనే వారికి ఫోన్లు చేసి భయపెట్టే  పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.

అంతే కాదు ప్రశ్నించి దళితులపై కేసులు పెట్టారు. దాడులు చేశారు. చివరికి ప్రజాప్రతినిధులను అసభ్యంగా మాట్లాడుతూ, రౌడీ షిట్ కేసులు కూడా ఓపెన్ చేశారు. వీటిపై పిర్యాదు ఇస్తే  నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ స్పందించక పోవడంపై  గతంలో జూపల్లి విమర్శలు చేశారు. ఇన్ని జరుగుతునందుకే  సర్వేలలో అధికార పార్టీకి వ్యతిరేకత కూడా వచ్చిందని, ఆ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా  వెళ్లిందనే ప్రచారం బాగా జరుగుతుంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా కష్టమొచ్చినా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అలా వాలిపోతున్నారు. అందుకే నియోజక ప్రజలలో అభిమానాన్ని మరింత కూడగట్టుకున్నారు. 2018 ఎన్నికల్లో తన అనుచర వర్గం పొరపాట్ల వల్లే ఓడిపోయానని  ఆయనే అంగీకరించారు. అయితే అదే సందర్భంలో కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల కోసం నా ప్రాణమైన అర్పిస్తాను.

చివరి శ్వాస వరకు నేను కొల్లాపూర్ ప్రజల కోసమే పని చేస్తానని ఆనాడే చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ప్రజా నాయకుడిగా తెలుసుకుంటున్నారు. ఆపద ఉన్నా ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ లు అందిస్తున్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో తోడుగా ఉన్న నాయకుల కార్యకర్తలకు అండగా ఉంటూ రక్షించుకున్నాడు.

ఆయన  నిరంతరం మార్నింగ్ వాకులతో   ఏదో ఒక కార్యక్రమం మీదగా ప్రజల్లోనే ఉంటున్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిన్న నాయకులకు, నిజమైన టిఆర్ఎస్ కార్యకర్తలకు జూపల్లి అండగా ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధమైన త్యాగాలు చేశారో  ప్రస్తుత అధికార పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా క్యాబినెట్ సభ్యులకు అందరికి తెలిసిందే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మంత్రి పదవికి, కాంగ్రెస్  పార్టీకి రాజీనామా చేసి తెలంగాణా ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేసి జిల్లా ప్రజలను చైతన్య పరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. తన20 ఏళ్ల రాజకీయలో తోడుగా ఉన్న తన  అనుచరుడిని కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని చిన్నాంభావి పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధిస్తున్నారని జూపల్లి 18వ తేదీన నేరుగా స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

ఫిర్యాదు చేసింది చిన్నంబాయి పోలీస్ స్టేషన్ ఎస్సై

ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు  చిన్నంబాయి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ. ఆయన పిర్యాదు మేరకు ఐపిసి 149 సెక్షన్ ప్రకారం 143, 353, 189,228,504,506 కేసు నమోదు చేశారు. ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు కావడం గమనార్హం. అయితే గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు అందరి కంట్లో నీరు తెపించాయి. తన చివరి శ్వాస వరకు కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని, వారితోనే నా ఊపిరి ఆగి పోయే వరకు ఉంటానని చెప్పారు.

తనను ఓడించిన ఆ  ప్రజలలోనే  తన స్థానాన్ని నిలబెట్టు కుంటున్నారు. ఇలాంటి  సమయంలో జూపల్లి కృష్ణ రావు పై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. అధికారులను దూషించిన అందుకే కేసులు నమోదు చేశాం అంటే మరీ స్టేషన్ లో దళితులపై ఎస్సైలు దాడులు చేస్తే మరి చర్యలు ఎందుకు తీసుకోలేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు పోలీస్ అధికారులకు. పోలీస్ లకు ఒకలాగ చట్టాలు ప్రజలకు మరో లాగా ఏమైనా ఉన్నాయా? అని విమర్శలు వస్తున్నాయి.దీనిపై మాజీ మంత్రి జూపల్లి అనుచరులు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో చూడాలి.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

డాక్టర్ మోహన్ కు ఆచార్య శిరోమణి పురస్కారం

Satyam NEWS

జర్నలిస్టు కుటుంబాలకు ఉచిత వైద్యం

Satyam NEWS

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment