38.2 C
Hyderabad
April 29, 2024 19: 53 PM
Slider ప్రత్యేకం

కామారెడ్డి కమిషనర్ పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం

#ktr

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ ను కేటీఆర్ ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని అన్నారు. నగరాలను అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు.

కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్ కు కేటాయించనున్నారు. అయితే దీన్ని ఆయా గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములను ఇవ్వబోమని అంటున్నారు.

తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తాము భూములను వదులుకునే ప్రసక్తే లేదని అన్నారు.

Related posts

హెల్ప్ డెస్క్: కోవిడ్ సోకిన తల్లిదండ్రుల పిల్లలకు భరోసా

Satyam NEWS

కార్మికుల శ్రమను దోచుకుంటున్న కాంట్రాక్టర్లు

Bhavani

నవంబరు 5 నుండి 7 వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

Satyam NEWS

Leave a Comment