28.7 C
Hyderabad
May 6, 2024 09: 59 AM
Slider నల్గొండ

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే కేసీఆర్ లక్ష్యం

#KTR Hujurnagar

సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ డి ఓ కార్యాలయాన్ని సోమవారం  రాష్ట్ర పురపాలక, ఐ టి అభివృద్ధి శాఖామంత్రి కే టి రామారావు, సహచర మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కలసి ప్రారంభించారు.

హుజుర్ నగర్ పురపాలక సంఘ భవన కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి మొక్కలు నాటారు. పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించ తలపెట్టిన అర్బన్ పార్క్ నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, డా.గాదరి కిశోర్ కుమార్, భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, జెడ్ పి చైర్ పర్సన్  దీపికా యుగంధర్, మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా, TRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, TRS రాష్ట్ర నాయకులు  వేమిరెడ్డి నరసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమరనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాలలోకి వచ్చాను

అనంతరం ఆర్ డి ఓ కార్యాలయంలో జరిగిన సభలో  MLA సైదిరెడ్డి  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఋణపడి ఉంన్నామన్నారు. KCR ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలలోకి వచ్చాను, KTR  దీశానిర్ధేశం మేరకు ప్రజా పరిపాలనలో నా వంతు కృషి చేస్తున్నాను అన్నారు. ఉప ఎన్నికలలో గెలిచిన వెంటనే KCR  హుజుర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి KTR , మంత్రి జగదీష్ రెడ్డి  సహాయంతో వెంటనే నిధులు మంజూరు చేశారన్నారు.

తాను అడిగిన వెంటనే ఇక్కడికి వచ్చిన అన్న KTR కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథ , కళ్యాణ లక్మి సృష్టికర్త మంత్రి కేటీఆర్ అని, మంచినీటి సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన చర్చలో పంచాయతీరాజ్ మంత్రి హోదాలో ప్రతిపాదించిన కేటీఆర్ ప్రతిపాదనలు అన్ని జనహితం కోసమే అన్నారు.

ఫ్లోరోసిస్ నుంచి ప్రజలను కాపాడేందుకే భగీరథ

కాలువ కింది ప్రాంతం అయిన  హుజుర్ నగర్ లోను ఫ్లోరోసిస్ ప్రభావం ఉందని, ఫ్లోరోసిస్ లాంటి విషపు నీటి నుండి రక్షించేందుకే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు అన్నారు. సురక్షితమైన నీటితో ఆరోగ్య పరిరక్షణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటువంటి బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుట్టారు అని తెలిపారు.

సమష్టి కృషితో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మినరల్ ఫండ్ నిధులు భూ కబ్జాలను సహించేది లేదని,కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ చెరువులకు సరిహద్దులు గుర్తిస్తుందని, కళ్యాణలక్ష్మి పథకానికి నామకరణం చేసింది కూడా మంత్రి కేటీఆరే అన్నారు.

పాలనను  ప్రజల ముంగిటకు  తెస్తూ అధికార వికేంద్రీకరణ కొరకు  ముఖ్యమంత్రి కేసీఆర్  పరిపాలన  సంస్కరణలకు తెరలేపారని, పరిపాలన సౌలభ్యం కొరకు కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, తండాలను, గూడెంలను  గ్రామ పంచాయితీ లుగా ఏర్పాటు చేశారు అన్నారు. నేడు సంక్షేమ ఫలాలు  ప్రజల ముంగిటకు వచ్చాయని, చిట్ట చివరి మనిషి వరకు ప్రభుత్వ  పథకాలు  చేరుతున్నాయని, హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్  ప్రజలకు  ఇచ్చిన ప్రతి   హామీని నెరవేర్చుతామని అన్నారు.

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఆగని సంక్షేమం

ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారి పట్ల కఠినంగానే ఉంటామని అధికారులకు ఆదేశం చేశారు. కరోనా తో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయని,ఇంత కష్ట కాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్   54 లక్షల 22 వేల రైతులకు 7 వేల  కోట్లను రైతు బంధు కింద ఆర్ధిక చేయూత ఇచ్చారని,అందరికి ఆసరా పెన్షన్లను , కల్యాణ లక్ష్మీ ,షాది ముబారక్  పథకాలకు డబ్బులు మంజూరు చేస్తున్నామని,రైతులకు   24 గంటల ఉచిత కరంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని అన్నారు.

హుజుర్ నగర్ లో స్కిల్ డవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసాము. యువతకు  ఉద్యోగాలు వస్తాయి,హైదరాబాద్ గొప్ప మెట్రోపాలిటన్ నగరం, హైదరాబాద్ టూ విజయవాడకు  హై స్పీడ్ రైలు ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేస్తామని,పార్టీలకు అతీతంగా  తెలంగాణలో  అభివృద్ధి జరుగుతుందని, ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు. మా ముందున్న లక్ష్యం అభివృద్ధి మాత్రమే అంటూ హుజుర్ నగర్  ఎన్నికల్లో  ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం  అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.

Related posts

21న ఖమ్మం కు చంద్రబాబు

Murali Krishna

మల్లాపూర్ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

CRPF జవాన్ల పిల్లలకు స్కూల్ బ్యాగుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment