32.7 C
Hyderabad
April 27, 2024 01: 04 AM
Slider ఆధ్యాత్మికం

మట్టపల్లిలో తొలి ఏకాదశికి భక్తులకు అనుమతి లేదు

#Mattapalyy Temple

సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈ సారి తొలి ఏకాదశి పర్వదినం జరపడం లేదు. ఆ రోజు భక్తులకు దర్శనం రద్దు చేశఆరు. మఠంపల్లి మండలం మట్టపల్లి దేవస్థానం, పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామిని దర్శించు కోవడానికి తెలుగు రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

మట్టపల్లి మహాక్షేత్రం లో తొలి ఏకాదశి పర్వదిన ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జులై 1న బుధవారం రోజున తొలి ఏకాదశి కి భక్తులను అనుమతించడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా దర్శనాలు రద్దు చేశారు.

30 నుంచి వచ్చే నెల 1 వరకూ ఆలయంలో దర్శనాలు నిలుపుదల చేస్తున్నామని, తిరిగి 2వ తేదీ మధ్యాహ్నం నుండి భక్తులకు యధావిధిగా భౌతిక దూరాన్ని పాటింపచేస్తూ దర్శనాలు కల్పిస్తారు. భక్తులందరూ ఈ విషయం గమనించాలని దేవాలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, కార్యనిర్వహణాధికారి పి.ఉదయ భాస్కర్  తెలిపారు.

Related posts

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

Bhavani

అనాధ అమ్మాయిల ఆచూకీ లభ్యం…!

Satyam NEWS

తప్పు మీద తప్పు: చివరికి మిగిలేదేమిటి?

Satyam NEWS

Leave a Comment