29.7 C
Hyderabad
May 4, 2024 03: 35 AM
Slider నల్గొండ

2016 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి

#CITU Hujurnagar

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న క్యాజువల్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్,ఉద్యోగులు, సిమెంటు వివిధ పరిశ్రమల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 2016 లో తీర్పు ఇచ్చిన ఇప్పటికీ అమలు చేయటం లేదని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.

కనీస వేతనం Go అమలు చేయటం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత డిగ్రీలు చేతపట్టుకుని ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన యువతకు ఉద్యోగావకాశాలు రాక, కూలి,నాలి పనులకు పోతుంటే కొంత మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని వీటి మీద దృష్టి పెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆయన కోరారు.

సూర్యాపేట జిల్లాహుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CITU కార్యాలయంలో కార్మికుల సమావేశంలో రోషపతి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు పర్యటనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు తేజం రమణ దంపతులకు ఆయన  స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం,హరిజన గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి,కాంట్రాక్ట్ కార్మికులందరనీ పర్మినెంట్ చేస్తామని చెప్పి చేయాలేదని ఆయన అన్నారు. గుట్టల మీద పెద్ద గోపురాలు కట్టడం కాదు అంతకంటే పెద్ద ఎత్తున గుట్టలుగా పడి ఉన్న నిరుద్యోగ, కార్మిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్,గుండెబోయిన వెంకన్న, చింతకాయల పర్వతాలు,దుర్గారావు, శ్రీను, గోవిందు, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.

Related posts

దొంగ డబ్బు కాకపోతే 2 వేల నోట్లు సులభంగా మార్చుకోవచ్చు

Satyam NEWS

టోల్ ప్లాజా ప్రారంభం తో ప్రజల ఆగ్రహం

Murali Krishna

గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment