38.2 C
Hyderabad
April 29, 2024 19: 43 PM
Slider గుంటూరు

చెత్త సేకరణ పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలి

#dr chadalawada

ప్రభుత్వం పన్నులు పెంచపోతుందని మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెబుతుంటే వాటిని ఖండించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తోందని గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రశ్నించారు.

ఆస్తిపన్ను,నీటి పన్ను, ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను పెంచేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసిందని ఆయన అన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రజలకు మోసం చేస్తున్నదని ఆయన అన్నారు.

ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో అరవింద బాబు ప్రభుత్వ విధానాన్ని దుయ్యబట్టారు. పురపాలక సంఘం పరిధిలో ప్రతి ఇంటి నుంచి సేకరించే చెత్తకు రుసుం పనులు చేయాలని నిర్ణయించడం పై  మండిపడ్డారు.

ఇది ముందు ముందు ప్రజలపై మోయలేని భారంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. లాక్ డౌన్ కష్టకాలంలో వల్ల పనులు లేక ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే చెత్త పై పన్నులు వేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఉందని ఆయన అన్నారు.

కరోనా కాలంలో పనులు లేక అనేక మంది జీవనం చిన్నాభిన్నం అయిందని ఇటువంటి తరుణంలో పనులు పెంచడానికి జీవోలు తేవటం దారుణమని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీవోలు ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

అమరావతి భూ కుంభకోణంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం విచారణ

Satyam NEWS

‘వారాహి’కి పూజలు: నేడు కొండగట్టుకు పవన్‌ కల్యాణ్‌

Satyam NEWS

బంద్ సందర్భంగా రాస్తారోకో చేసిన టీడీపీ నేతల అరెస్టు

Satyam NEWS

Leave a Comment