38.7 C
Hyderabad
May 7, 2024 16: 42 PM
Slider ఖమ్మం

ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా చేయాలి

#Collector

జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో అధికారులతో భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు, వాటికి భూసేకరణ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొనిజర్ల మండలం గుబ్బకుర్తిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను 234.24 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, ఇప్పటి వరకు 113.25 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు ఆయన తెలిపారు. భూసేకరణ పూర్తయిన చోట పంటలు వేయకుండా అవగాహన కల్పించాలని, భూముల స్వాధీనం చేసుకోవాలని ఆయన అన్నారు. రోడ్లు, భవనాల శాఖచే సిరిపురం-లక్ష్మీపురం హై లెవల్ వంతెన, ముజ్జుగూడెం రోడ్డు నిర్మాణానికి భూసేకరణ కు నిధులు జమచేయాలన్నారు.

సింగరేణి మండలం అప్పాయిగూడెం వద్ద నాబార్డ్ గోడౌన్ల కు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. 3వ రైల్వే లైన్ కొరకు జిల్లాలో 141.23 ఎకరాల భూసేకరణ కుగాను 122.21 ఎకరాల భూసేకరణ పూర్తయినట్లు ఆయన తెలిపారు. గోవిందాపురం, ఖమ్మం, బురహాన్ పురం వద్ద కట్టడాల వాల్యుయేషన్ పూర్తిచేయాలని ఆయన అన్నారు.

సింగరేణి మండలం గాంధీపురం రైల్వే స్టేషన్ విస్తరణకు ప్రిలిమినరి నోటిఫికేషన్ జారిచేసినట్లు, ప్రిలిమినరి డిక్లరేషన్ వెంటనే చేపట్టాలన్నారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల్లో కట్టడాల వాల్యుయేషన్, నష్టపరిహారం చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం కు ప్రాధాన్యం ఉన్నచోట భూసేకరణ కు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలని, నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, కలెక్టరేట్ భూసేకరణ విభాగ పర్యవేక్షకులు రంజిత్, ఇర్రిగేషన్, నేషనల్ హైవే, రోడ్లు భవనాలు, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నార

Related posts

కరోనా పెరుగుతున్నe సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్టు లేదు…!

Satyam NEWS

సైబరు మోసగాళ్ళు పట్ల అప్రమత్తత అవసరం

Satyam NEWS

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

Satyam NEWS

Leave a Comment