31.2 C
Hyderabad
May 2, 2024 23: 48 PM
Slider ఖమ్మం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే

#CPM Khammam

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్‌ లు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవనం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బుగ్గవీటి సరళ అధ్యక్షతన జరిగిన సిపిఎం పార్టీ పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్లోని మాట్లాడారు. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజా ఉద్యమాలలో ముందుకు సాగాలన్నారు.

నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి రజాకారులకు ముచ్చెమటలు పట్టించి ‘‘నీ బాంచన్‌ కాల్మొక్త దొర’’ అనే బానిసత్వాన్ని ఎదిరించి ‘‘బద్మాష్‌ నా కొడకా’’ అంటూ తిరగబడిన గొప్ప వీరులను కన్న ప్రాంతం ఖమ్మం అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేలమంది అమరులైనారని, 10 లక్షల ఎకరాల భూమిని పేదప్రజలకు పంచిన చరిత్ర ఎర్రజెండాది అన్నారు.

ఇంతటి చరిత్రను వక్రీకరిస్తూ బిజెపి ముస్లింలకు జరిగిన చరిత్ర అంటూ పక్కదారి పట్టిస్తున్నారని సాయుధ పోరాట చరిత్ర గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని వారు అన్నారు. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామ గ్రామాన జరపాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో భారీ సభను నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. 16వ తారీకున ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి బైక్‌ ర్యాలీలు ఖమ్మం నగరానికి చేరుకుంటాయని తెలిపారు.

కూసుమంచి నేలకొండపల్లి ఖమ్మం రూరల్‌ మండలాలకు చెందిన బైక్‌ ర్యాలీ వరంగల్‌ క్రాస్‌ రోడ్డు తమ్మినేని సుబ్బయ్య భవనం నుంచి ప్రారంభం అవుతుందని అక్కడి నుండి జలగం నగర్‌ కాల్వ ఒడ్డు రోడ్డు మీదగా భక్త రామదాసుకు చేరుకుంటుందన్నారు. వైరా రూరల్‌, వైరా టౌన్‌, కొణిజర్ల, ఖమ్మం అర్బన్‌, హావేలి, ఖమ్మం 2 టౌన్‌ మండలాల నుండి మోటార్‌ సైకిల్లు శ్రీశ్రీ విగ్రహం మీదుగా వైరా రోడ్డు కవర్‌ చేస్తూ సాగుతాయి అన్నారు.

సింగరేణి కామేపల్లి రఘునాథపాలెం మండలాల నుండి ఇల్లెందు రోడ్డు మీదుగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బైపాస్‌ రోడ్డు మీదుగా ర్యాలీ వస్తుందని అన్నారు. తిరుమలాయపాలెం మండలానికి ర్యాలీ మండల కేంద్రం నుంచి ఖమ్మం నగరానికి చేరుకుంటుందని అన్నారు. బోనకల్లు చింతకాని ఖమ్మం 1 టౌన్‌ మండలాలకు చెందిన వాహనాలు ముస్తఫా నగర్‌ చర్చి కాంపౌండ్‌ జడ్పీ సెంటర్‌ మీదగా వస్తాయని, ముదిగొండ ఖమ్మం 3 టౌన్‌ మండలాలకు చెందిన వాహనాలు ప్రకాష్‌ నగర్‌ శ్రీనివాస్‌నగర్‌ గాంధీచౌక్‌ లను కవర్‌ చేసుకుంటూ కళాక్షేత్రానికి చేరుకుంటాయని తెలియజేశా

Related posts

బోద‌వ్యాధి రాకుండా డీఈసీ మాత్ర‌ల‌ను తీసుకోవాలి

Satyam NEWS

శ్రీశైలం లో దసరా మహోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

ఆన్ లైన్ ఫ్రాడ్ పై సదస్సు

Sub Editor

Leave a Comment