29.7 C
Hyderabad
May 4, 2024 06: 02 AM
Slider ఖమ్మం

భూ సేకరణ వేగంగా చేయాలి

#Land

వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పిఎంజి) కో-ఆర్డినేషన్ కేబినెట్ సెక్రటరీ రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ ప్రదీప్ కె త్రిపాఠి అన్నారు. న్యూఢిల్లీ నుండి నేషనల్ హైవే, రైల్ 3వ లైన్ ప్రాజెక్టుల భూసేకరణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూ సేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించి, ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఆర్బిటరీ స్థాయిలో నిధుల డిపాజిట్ కొరకు వేచివున్నట్లు, నిధుల డిపాజిట్ కాగానే ప్రక్రియ చేపట్టి, పూర్తి చేస్తామన్నారు.

ప్రాజెక్ట్ ల పూర్తికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇర్రిగేషన్ అధికారి వెంకట్రాం, కలెక్టరేట్ భూసేకరణ సూపరింటెండెంట్ రంజిత్, నేషనల్ హైవే మేనేజర్ దివ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాశ్మీర్‌‌‌‌ ప్రశాంతం శ్రీనగర్‌‌‌‌లో మాత్రం ఆందోళన

Satyam NEWS

కేజీ బియ్యం ఒక్క రూపాయి…. కేజీ ఇసుక రెండు రూపాయలు

Satyam NEWS

ఫిబ్రవరి 15 నాటికి తిరునాళ్ళ పనులు పూర్తి కావాలి

Satyam NEWS

Leave a Comment